Ram Charan Fatherhood: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట మారుమోగిపోతోంది. ఈ స్టార్ కపుల్ త్వరలోనే మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారని, ఈసారి వారి ఇంట్లోకి కవల పిల్లలు అడుగుపెట్టబోతున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి (Ram Charan Fatherhood).
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సమాచారం ప్రకారం, ఉపాసన ఈ నెల చివరన అంటే జనవరి 31న డెలివరీ అయ్యే అవకాశం ఉందట. ఈసారి ఉపాసనకు కవలలు పుట్టబోతున్నారనే వార్త మెగా అభిమానుల్లో ఎనర్జీని నింపింది. తన కుటుంబానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చే రామ్ చరణ్, ప్రస్తుతం షూటింగ్ పనులకు విరామం ఇచ్చి ఉపాసన వెంటే ఉంటున్నారట (Ram Charan fatherhood)
డెలివరీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు అత్యంత గోప్యంగా, జాగ్రత్తగా జరుగుతున్నట్లు సమాచారం . 2012లో వివాహం చేసుకున్న ఈ జంటకు, 2023 జూన్ 20న తొలి సంతానంగా క్లీంకార కొణిదెల (Ram Charan daughter Klin Kaara)జన్మించింది (Ram Charan Upasana baby). గతేడాది దీపావళి సమయంలోనే ఉపాసన శీమంతం వేడుకలను మెగా కుటుంబం అత్యంత వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే (Ram Charan twins 2026)
ట్విన్స్ గురించి వస్తున్న వార్తలపై మెగా ఫ్యామిలీ నుండి ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అయినప్పటికీ, అభిమానులు మాత్రం అప్పుడే సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ‘జూనియర్ మెగా పవర్ స్టార్’, ‘సింబా ఈజ్ కమింగ్’, ‘ది ప్రిన్స్ అరైవింగ్’ వంటి హ్యాష్ ట్యాగ్‌లతో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఒకవేళ ఇది నిజమైతే, మెగా స్టార్ చిరంజీవి ఇంట మరోసారి పండగ వాతావరణం నెలకొనడం ఖాయం.