RashmikaMandanna Injured: గాయపడ్డ రష్మిక…సల్మాన్‌ఖాన్‌కు షాక్‌

Viswa
1 Min Read

Web Stories

టాప్‌ హీరోయిన్‌ రష్మికా మందన్నా గాయపడ్డారు (RashmikaMandanna Injured). జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో రష్మికా మందన్నా (RashmikaMandanna )కాలికి గాయమైంది. దీంతో రష్మికా మందన్నా తన సినిమాల షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇవ్వాల్సిన పరిస్థితి.

ప్రస్తుతం రష్మికా మందన్నా హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ‘సికందర్‌’ (Sikandar) అనే మూవీ చేస్తున్నారు. ఏఆర్‌ ముర గదాస్‌ ఈ సినిమాకు దర్శకుడు. సాజిద్‌ నడియాద్‌వాలా నిర్మిస్తున్న ఈ మూవీ ఈద్‌ సందర్భంగా రిలీజ్‌ కావాల్సింది. రిలీజ్‌ డేట్‌ కాస్త దగ్గరకు వస్తుండటంతో సల్మాన్‌ఖాన్‌ అండ్‌ టీమ్‌ ఫిబ్రవరిలోపు మొత్తం షూటింగ్‌ను కంప్లీట్‌ చేయాలనుకున్నారు.

ఈ నెల 9 నుంచి ముంబైలో ఓ లాంగ్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. కట్‌ చేస్తే….రష్మికా మందన్నా గాయపడ్డారు. దీంతో ఈ షూటింగ్‌ షెడ్యూల్‌ను హఠాత్తుగా ఆపేయాల్సి వచ్చింది. ఇలా సల్మాన్‌ఖాన్‌ షాక్‌కు గురై య్యారు. 9న జరగాల్సిన ‘సికందర్‌’ మూవీ ౖఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ క్యాన్సిల్‌ అయ్యిందే, ఈ తేదీ కంటే ముందే రష్మికా మందన్నా గాయపడి ఉంటారు. తాజా ఆమె లేటెస్ట్‌ ఫోటోలను రిలీజ్‌ చేశారు.

ఈ సినిమాయే కాకుండా…హిందీలో ‘థామా’ (Thama) అనే మూవీ చేస్తున్నారు రష్మికా మందన్నా. ఆయుష్మాన్‌ ఖరానా హీరోగా చేస్తున్న ఈ మూవీ దీపావళికి రిలీజ్‌ కానుంది. అలాగే విక్కీ కౌశల్‌తో రష్మికా మందన్నా చేసిన ‘ఛావా’ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. ఇలా వరుస హిందీ చిత్రాలతో రష్మికా మందన్నా బిజీ బిజీ.

 

 

 

 

Please Share
Share This Article
136 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu