vishwak sen laila movie review: విశ్వక్‌సేన్‌ ‘లైలా’ రివ్యూ

Viswa
4 Min Read
Laila movie Review

కథ

vishwak sen laila movie review: హైదరాబాద్‌లో బ్యూటీపార్లర్‌ రన్‌ చేస్తుంటాడు సోనూ మోడల్‌ (విశ్వక్‌సేన్‌). తన పార్లర్‌కు వచ్చే మహిళలతో చాలా చనువుగా, స్నేహంగా ఉంటుంటాడు. అలాగే జిమ్‌ ట్రైనర్‌ జెన్నీ (ఆకాంక్షా శర్శ)తో ప్రేమలో పడతాడు. మరోవైపు లోకల్‌ ఎస్‌ఐ శంకర్‌తో సోనూ మోడల్‌కు గొడవ జరుగుతుంది. దీంతో సోనుపై పగ తీర్చుకు నేందుకు శంకర్‌ ఎదురుచూస్తుంటాడు. మరోవైపు తన పార్లర్‌కు వచ్చే జ్యోతి అనే మహిళకు రెండు లక్షల రూపాయాల ఆర్థికసాయం చేస్తాడు సోనూ మోడల్‌. జ్యోతి భర్త నాగరాజు ఆయిల్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఈ ఆయిల్‌ ప్రమోషన్‌ కోసం తన పేరు, తన ఫోటోను వాడుకోమని నాగరాజు–జ్యోతి దంపతులకు సలహా ఇస్తాడు సోనూ. సోనూ ఆయిల్‌గా ఆ ఆయిల్‌ బాగా అమ్ముడు పోతుంటుంది. అక్కడి లోకల్‌ రౌడీ, మేకల వ్యాపారం చేసుకునే రుస్తుమ్‌ (అభిమన్యుసింగ్‌) పెళ్లిలో ఈ ఆయిల్‌ వాడటం వల్ల ఫుడ్‌ పాయిజన్‌ అవు తుంది. లోకల్‌ ఎమ్మెల్యేతో సహా, ఈ పెళ్లికి హాజరైనవాళ్ళు, మరికొంతమంది ప్రజలు అస్వస్థతకు లోనై, హాస్పిటల్‌లో జాయిన్‌ అవుతారు. సోనూ కోసం పోలీసులు వెతుకుతుంటారు. అలాగే రుస్తమ్‌ పెళ్లి చేసుకున్న అమ్మాయి కలర్‌ బ్లాక్‌. కానీ సోనూ బాగా మేకప్‌ వేయడంతో, ఆ అమ్మాయిని రుస్తుమ్‌ పెళ్లి చేసుకుంటాడు. ఇలా సోనూ కారణంగా తాను కలర్‌ తక్కువ ఉన్న అమ్మాయి సుందరి (కామాక్షీ భాస్కర్ల)ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చి ందని, సోనూపై రుస్తుమ్‌ పగ పెంచుకుంటాడు.

ఒకవైపు తనపై కోపంగా ఉన్న సీఐ శంకర్, మరోవైపు రుస్తుమ్, ఇంకోవైపు తన తల్లి సీత జీవితకష్టంతో ఉన్న బ్యూటీపార్లర్‌ను కాపాడుకోవడం….ఈ మూడు సమస్యలను సాల్వ్‌ చేయడం కోసం సోనూ లైలాగా మారతాడు. మరి..లైలాగా సోనూ అనుకున్నది సాధించాడా? అసలు..కల్తీ ఆయిల్‌ మాఫియాలో సోనూను ఇరికించింది ఎవరు? అన్న ఇంట్రెస్టింగ్‌ విషయాలను స్క్రీన్‌పై చూడాలి (vishwak sen laila movie review).

విశ్లేషణ

విశ్వక్‌సేన్‌ లేడీ గెటప్‌ అనగానే ఆడియన్స్‌లో కాస్త క్యూరియాసిటీ ఏర్పడించింది. హీరో లేడీ వేషం వేసిన ‘భామనే సత్యభామనే, మేడమ్‌’ ఇటీవల..‘రెమో’ వంటి సినిమాలు ఆడియన్స్‌ను అలరించాయి. ఈ నేపథ్యంలో విశ్వక్‌సేన్‌ లేడీ గెటప్‌ వేసే మూవీ ఎలా ఉంటుందా? అనే ఆసక్తి అయితే ఆడియన్స్‌లో క్రియేట్‌ అయ్యింది. కానీ ఈ అంచనాలను అందుకోవడంలో విశ్వక్‌సేన్‌ పూర్తిగా విఫలం అయ్యాడు. సరైన కథను ఎంపిక చేసుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయాడు.

రోటీన్‌ టెంప్లెట్‌ కమర్షియల్‌ మూవీ సీన్స్‌ తరహాలోనే ‘లైలా’ మూవీ ప్రారంభం అవుతుంది. సీఐ శంకర్‌తో గొడవ, రుస్తుమ్‌ పెళ్లి ఇష్యూ, సోనూ మోడల్‌ లవ్‌ ట్రాక్‌..లతో చాలా బోరింగ్‌గా, ఏ మాత్రం ఆసక్తి లేకుండ తొలిభాగం ముగుస్తుంది. ఇంట్రవెల్‌ సమయానికి హీరో లైలాగా మారే సిట్చ్యూవేషన్‌ క్రియేట్‌ అవుతుంది. ఇది కూడా ఆడియన్స్‌ ఊహాకు తగ్గట్లే ఉంటుంది. లైలా మారడం, ఈ లైలాతో ఎస్‌ఐ శంకర్, రుస్తుమ్‌ ప్రేమలో పడటం, ఫైనల్‌గా నిజం బయటకు రావడం, హీరో తన నిర్దోషిగా నిరూపణకావడంతో కథ ము గుస్తుంది.

సెకండాఫ్‌లో వచ్చే లైలా సీన్స్‌ కూడా అంతగా ఆకట్టుకోవు. సాంగ్స్‌ స్క్రిన్‌పై రిచ్‌గా కనిపించాయి కానీ… ఆడియన్స్‌ను మెప్పించలేకపోయాయి. ఇక డబుల్‌మీనింగ్‌ డైలాగ్స్, హీరోయిన్‌ స్కిన్‌ షోలకు కొదవే లేదు. ముఖ్యంగా డైలాగ్స్‌ అయితే మరీ దారుణంగా, ఫ్యామిలీతో కలిసి ఆడియన్స్‌ సినిమా చూడలేని విధంగా ఉన్నాయి. తొలిభాగంలో పార్క్‌లో వచ్చే ఓ సీన్‌ అయితే ట్రోల్‌ చేసేలా ఉంటుంది. సరైన కథ, కథనం, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఏమీ లేకుండా…కేవలం హీరో లేడీ గెటప్‌ వేస్తే…కొత్తగా ఉంటుంది. ఆడియన్స్‌ థియేటర్స్‌కు వస్తారనుకుంటే పొరపాటే. ఇది ఓటీటీ యుగం అని మేకర్స్‌ ఓ సారైనా గుర్తుతెచ్చుకోవాలి. కథ కోసం లేడీ గెటప్‌ వేస్తే బాగుంటుంది కానీ…లేడీ గెటప్‌ కోసం సినిమా తీస్తే తేలిపోతుంది లైలా మూవీలా. అలాగే దర్శకుడు రామ్‌నారాయణ్‌ నమ్మిన మదర్‌ సెంటిమెంట్‌ కూడా వర్కౌట్‌ కాలేదు. సినిమా అంతా అక్రమసంబంధాలు, రెండో పెళ్లి, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌లను బలంగా చూపించి, చివర్లో కేవలం ఒక పాత్రనే సందేశాత్మకంగా చూపిస్తే, యూత్‌ ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతారనుకోవడం కరెక్ట్‌ కాదు.

పెర్ఫార్మెన్స్‌

సోనూ మోడల్, లైలా పాత్రల్లో విశ్వక్‌ సేన్‌ యాక్ట్‌ చేశాడు. లైలాగా విశ్వక్‌సేన్‌ మెప్పిస్తాడనుకుంటే, సోనూ మోడల్‌ క్యారెక్టర్‌ బెటర్‌ అనిపించేలా కథ ఉంది. రోటీన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయి. జెన్నీ పాత్రలో ఆకాంక్షకు గ్లామర్‌ షో తప్ప యాక్టింగ్‌కు స్కోప్‌ లేదు. అల్ట్రా డీ–గ్లామరెస్‌గా కనిపించిన కామాక్షీ భాస్కర్ల రోల్‌ కూడా కథపై ఇంపాక్ట్‌ చూపించలేకపోయింది. కామాక్షీ రోల్‌కు సెపరేట్‌ ట్రాక్‌ నడుస్తున్నట్లుగా ఉంటుంది. శంకర్‌గా పృథ్వీ రాజ్, రుస్తుమ్‌గా అభిమన్యుసింగ్‌లకు మంచి స్క్రీన్‌ ప్రెజెన్స్‌ దక్కింది. కానీ కథలో బలం లేన్నప్పుడు ఎవరు ఎంత యాక్ట్‌ చేసిన ఉప యోగం ఉండదు. రుస్తుమ్‌ తండ్రిగా వినీత్‌ కుమార్, హీరో ఫ్రెండ్‌ పింకీ మోడల్‌గా ప్రణీత్, యూట్యూబర్‌గా సునితన్, మేకల సత్యగా 30 ఇయర్స్‌ పృథ్వీ వారి వారి పాత్రల మేరకు చేశారు. లియోన్‌ జేమ్స్‌ సంగీతం ఈ సినిమాకు ఫ్లస్‌ కాలేకపోయింది. రిచర్డ్‌ విజువల్స్‌ ఒకే. రైటర్‌ వాసుదేవ్‌ మూర్తి సరిగ్గా కథ రాయాల్సింది.

బాటమ్‌ లైన్స్‌: ఈ లైలా నచ్చదు.

రేటింగ్‌: 1.5/5

Brahmanandam Brahma Anandam Review: బ్రహ్మాఆనందం రివ్యూ

 

 

 

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *