కథ
Yami Gautam Dhoom Dhaam Review: వీర్ (ప్రతీక్ గాంధీ), కోయల్ (యామీ గౌతమ్)లు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారు. వీరి జాతకాల ప్రకారం రెండు వారాల్లోనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోలేకపోతారు. వీరి ఫస్ట్‌నైట్ రోజు ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చి, వీరిని (వీర్, కాయల్) డిస్ట్రబ్ చేసి, చార్లీ ఎక్కడని అడుగుతారు. వీర్, కోయల్‌లను చంపే స్తామని బెదిరిస్తారు. అయితే వచ్చిన వ్యక్తులు ముంబై సీఐడీ పోలీసులు అని వీర్– కోయల్‌లకు తెలుస్తుంది. అసలు.. ముంబై సీఐడీ పోలుసులు–వీర్,కాయల్‌లు వెతుకుతున్న చార్లీ చాప్లిన్ కీ చైన్ ఉన్న పెన్‌డ్రైవ్‌లో అసలు ఏముంది? ఓ క్రైమ్ నుంచి తప్పుంచుకునే క్రమంలో వీర్ గురించి కాయల్, కాయల్ గురించి వీర్‌లు తెలుసుకున్న నిజాలు ఏమిటి? ఒకరినొకరి గురించి నిజాలు తెలుసుకున్న తర్వాత, ఒకరి కొకరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు? వీరి వివాహ బంధం కొనసాగిందా? కోయల్ బ్యాచిలరేట్ పార్టీలో ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాలి (Yami Gautam Dhoom Dhaam Review).
విశ్లేషణ
ఆరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత ఓ అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు తెలుసుకునే విధానాన్ని నార్త్ కల్చర్‌తో, ఓ క్రైమ్ ఎలిమెంట్‌ను జోడించి, ఓ రోజులో చూపించాలనుకున్నాడు దర్శకుడు. ఓ క్రైమ్ ఏటాక్‌తో సినిమా మొదలువుతుంది. ఆ తర్వాత వెంటనే వీర్, కోయల్‌ల పెళ్లి సీన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ వెంటనే సాగే చేజింగ్ సీన్స్‌తో సినిమా ముందుకు వెళ్తుంటుంది. మేజర్ సినిమా అంతా చేజింగ్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుంది. వీర్– కోయల్‌లను మఫ్తీలో ఉన్న పోలీసులు చేజ్ చేయడం సీన్స్‌తోనే మెజార్టీ సీన్స్ ఉంటాయి. సెకండాఫ్‌లో వచ్చే ఒకట్రెండు ట్విస్ట్‌లు బాగుంటాయి. కానీ థ్రిల్లింగ్‌గా మాత్రం అనిపించవు. ఒక రోజులో జరిగే కథ కాబట్టి సినిమా మొత్తం హీరో హీరోయిన్లు ఒకే కాస్ట్యూమ్‌లో కనిపిస్తారు. తెలుగు అనువాదమే అయినప్పటికీని, మధ్యలో వచ్చే రెండు హిందీ సాంగ్స్ కూడా డిస్ట్రబ్‌గా ఉంటాయి. క్లైమాక్స్ కూడా చాలా రోటీన్‌గా ఉం టుంది. తెలుగు డబ్బింగ్ కూడ పెద్ద ఎఫెక్టివ్‌గా ఉండదు.
పెర్ఫార్మెన్స్
కోయల్‌గా యామి గౌతమ్ బాగా యాక్ట్ చేశారు. రెబల్ అమ్మాయిగా యామీ గౌతమ్ పెర్ఫార్మెన్స్ సూప ర్భ్‌గా ఉంటుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయి. ఫస్ట్‌హాఫ్‌లో అమ్మాయి సమస్యల గురించి యామీ అనర్గళంగా చెప్పే ఓ సీన్ బాగుంటుంది. అయితే అప్పటివరకు స్ట్రాంగ్ అనిపించిన యామీ గౌతమ్ రోల్ ఒక్కసారిగా, ప్రీ క్లైమాక్స్‌లో డౌన్ అయిపోతుంది. ఇక అమాయకపు వేటేరినయన్ (పశువుల డాక్టర్)గా ప్రతీక్‌గాంధీ యాక్టింగ్ కూడా బాగుంటుంది. ఒకట్రెండు కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్స్‌ను కామెడీ టైప్‌లో డిజైన్ చేశాడు డైరెక్టర్. కానీ చాలా రోటీన్. ఎన్నో తెలుగు సినిమాల్లో ఆడియన్స్ చూసే ఉంటారు.ముంబై సీఐడీ ఆఫీసర్‌గా ఇజామ్‌ఖాన్, ముకుల్ చద్దా, పవిత్రా సర్కార్, హీరోయిన్ మావయ్య కుష్వంత్ కపూర్‌గా కెవిన్, కోయల్ ఫ్రెండ్ కనికగా గరిమలు వారి వారి పాత్రల మేరకు యాక్ట్ చేశారు. సినిమాను ఎడిటర్ చాలా షార్ప్ టైమ్‌లో కట్ చేశాడు. నిడివి రెండు గంటలలోపే ఉంటుంది. దర్శకుడు రిషబ్‌సేతు ఎంచుకున్న కథ కాస్త కొత్తగా ఉంటే బాగుండేది.
బాటమ్‌లైన్: ఇల్లు అలకగానే పండగ కాదు…రోటిన్ కథతో సినిమా ఆడియన్స్‌ను మెప్పించదు.
రేటింగ్: 2/5