Hansi Productions announces a fresh love story: జగన్ యోగిరాజు, నవ్వ చిట్యాల హీరో హీరోయిన్లుగా, దేశీ ప్రసాద్, లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర కీలక పాత్రల్లో నటించనున్న సినిమా ప్రారం భోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించబడుతున్న తొలి సినిమా ఇది. రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ యూత్‌ఫుల్ లవ్ డ్రామా సినిమాకు హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, తవిటిరాజు తల చింతల సహ–నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, శ్రీహన్సిక పెద్దిరెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందించారు.

తొలి సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడు తూ–‘‘సినిమా అనేది నా కల. ఒక అభిరుచి. ఒక బాధ్యత. అదే ప్రేమతో ఇప్పుడు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాను. హన్సి ప్రొడక్షన్స్‌లో తొలి సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం.బ్యూటీఫుల్ లవ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ డ్రామాగా సినిమా కథనం ఉంటుంది. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం…ఈ మూడు అంశాల మేళవింపుగా ఈ సినిమా కథనం ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రతి యువకుడి మనసుకు దగ్గరయ్యే భావాలు, ప్రతి కుటంబ ప్రేక్షకుడు ఆస్వాదించే వినోదం మా సినిమాలో ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చెప్పారు. ఈ సినిమాకు సంగీతం రాజీవ్ రావ్.
References:
Grand portage casino https://qasimlhff177210.luwebs.com/42493514/casino-of-gold-dein-ultimativer-guide
References:
Wind river casino http://downarchive.org/user/bridgeatom7/
References:
Casino Echtgeld https://book-of-dead-online-casinos.online-spielhallen.de/