Single movie review: శ్రీవిష్ణు సింగిల్‌ మూవీ రివ్యూ

Viswa
3 Min Read
Single movie review: శ్రీవిష్ణు సింగిల్‌ మూవీ రివ్యూ

Web Stories

సినిమా: సింగిల్‌ (Single movie review)
ప్రధాన తారాగణం: శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిశోర్‌ (Single movie Lead Actores)
దర్శకత్వం: కార్తీక్‌రాజు
నిర్మాతలు: అల్లు అరవింద్‌ (సమర్పణ), భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి, విద్యా కొప్పినీడి
ఎడిటర్‌: కేఎల్‌ ప్రవీణ్‌
సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌
కెమెరా: ఆర్‌వేల్‌ రాజా
డైలాగ్స్‌: భానుభోగవరపు– నందు సవిరిగాన
విడుదల తేదీ: మే 9, 2025 (Single movie Release date)
నిడివి: 2 గంటల 9 నిమిషాలు
రేటింగ్‌: 2.75/5

Single movie review: స్టోరీ

SDFC బ్యాంకులో ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయి విజయ్ (శ్రీవిష్ణు). విజయ్ కో ఎంప్లాయి అరవింద్ (వెన్నెల కిశోర్).  ఓ అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆడీ కార్ షో రూమ్ లో పని చేసే పూర్వ (కేతిక శర్మ) ని ఇష్ట పడతాడు విజయ్. పూర్వ ని లవ్ లో పడేసే క్రమంలో ఓ ప్లాన్ వేస్తాడు విజయ్. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు.. కానీ ..విజయ్ కి డాన్సర్ హరిణి పరిచయం అవుతుంది. పూర్వ ని విజయ్ లవ్ చేస్తాడు. విజయ్ ని హరిణి లవ్ చేస్తుంది. మరి… పూర్వ పై విజయ్ లవ్ గెలుస్తుందా? లేక హరిణి లవ్ నిలబడుతుందా? ఇవేమి కాకా మరోలా  జరుగుతుందా? అనేది మిగిలిన స్టోరీ.

వివరణ

ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ సీన్స్ ఆడియన్స్ ని ఫుల్ గా నవ్విస్తాయి. స్క్రీన్ పై శ్రీవిష్ణు- వెన్నెల కిశోర్ వచ్చిన ప్రతిసారి ఆడియన్స్ ఫేస్ లోకి నవ్వు వస్తుంది. మెట్రో కామెడీ ఎపిసోడ్స్, సోషల్ మీడియా స్ఫూప్స్ డైలాగ్స్, సోషల్ మీడియా మీమ్స్ తో వచ్చే డైలాగ్స్ బాగా నవ్వి స్తాయి. సింగల్ సాంగ్ కూడా మెప్పిస్తుంది. చాలా సినిమాలు, చాలా మంది హీరో ల స్పూఫ్ డైలాగ్స్ నవ్విస్తాయి. గాయత్రి ఎపిసోడ్స్ మెప్పిస్తాయి.

ఫస్ట్ హాఫ్ కామిక్ గా కంప్లీట్ అవుతుంది. సెకండ్ హాఫ్ కూడా కామిక్ గానే స్టార్ట్ అయినా మెల్లిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. హరిణి బ్యాక్ స్టోరీ సినిమా ని మలుపు తిప్పుతుంది. కానీ వెంటనే.. కామెడీ ట్రాక్ ట్రాక్ ఎక్కడం ఈ సినిమా ప్లస్ పాయింట్. డైరెక్టర్ కార్తీక్ రాజు ఓ సింపుల్  ట్రై యాంగిల్‌ లవ్ స్టోరీ ని కామిక్ గా చెప్పిన తీరు మెప్పిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే లో తడబడ్డాడు. నందు -భాను డైలాగ్స్ సినిమా కి ప్లస్ అయ్యాయి. కానీ డిఫరెంట్ క్లైమాక్స్ మెప్పించదు. సినిమా ఇన్ కంప్లీట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌ను ఏదో హడావిడిగా ముగించేసిన ఫీలింగ్‌ కలుగుతుంది.

పెర్ఫార్మేన్స్

శ్రీ విష్ణు సూపర్ గా యాక్ట్  చేశాడు. కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ తో  తన స్టయిల్ అఫ్ కామిక్ యాక్టింగ్ తో శ్రీవిష్ణు అదరగొట్టాడు. మెట్రో సీన్స్ ఎపిసోడ్, పబ్ సీన్ ఎపిసోడ్, వెన్నెల కిశోర్ తో ఉండే కాంబినేషన్ సీన్స్ లో విష్ణు యాక్టింగ్ మెప్పిస్తుంది. పూర్వ గా కేతిక శర్మ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. సినిమా లో వచ్చే ఎమోషనల్ కన్ఫ్లిక్ట్ ఈ రోల్ తోనే ఉంటుంది. మంచి రోల్ దొరికింది. యాక్టీవ్ అండ్ హైపర్ అమ్మాయి హరిణి గా ఇవాన మెప్పించింది. ఈ క్యారెక్టర్ నుంచి వచ్చే చిన్న ట్విస్ట్ కూడా ఒకే.

ఈ సినిమా కు మరో మేజర్ హైలైట్ వెన్నెల కిశోర్ పెర్ఫార్మన్స్. సినిమా త్రూ అవుట్ వెన్నెల కిశోర్ రోల్ ఉంటుంది. వెన్నెల కిశోర్ లవ్ ట్రాక్ కూడా సినిమా లో మంచి కామిక్ గానే ఉంటుంది. ASN మూర్తి గా రాజేంద్ర ప్రసాద్ రోల్ తో ఎమోషనల్ గా ఉంటుంది. నార్నెనితిన్, సురేంద్ర గా కమెడియన్ సత్య రోల్స్ సర్ప్రైజ్గా ఉంటాయి. బ్యాంకు మేనేజర్ గా వీటీవీ గణేష్,  తల్లి పాత్ర లో కల్పలత, బాల నటుడు బుల్లి రాజు వంటి వాళ్ళు వారి వారి పాత్రల మేరకు యాక్ట్ చేసారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, RR బాగుంది. ఎడిటింగ్, విజువల్స్ పర్వాలేదు. నిర్మాణ విలువలు స్టోరీ కి తగ్గట్లు ఉన్నాయి.

బాటమ్‌లైన్‌ : నాన్‌స్టాప్‌ నవ్వుల సింగిల్‌

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Manasa Varanasi Shivani Nagaram Heroine Nabanatesh Latest Pics Krithishetty Ritika Nayak