Bhairavam Release: రీమేక్‌ సినిమా వర్కౌట్‌ అవుతుందా?

Viswa
2 Min Read
Telugu movie Bhairavam Release date fixed

Web Stories

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ బూమ్‌ పెరిగిన తర్వాత సినిమాలో కొత్తదనం ఉంటేనే ఆడియన్స్‌ థియేటర్స్‌కు వస్తున్నారు. ఓ సినిమా థియేటర్స్‌లో రిలీజై, ఆ తర్వాత పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటే, అప్పుడు థియేటర్స్‌కు కదిలే ఆడియన్స్‌ మరికొంతమంది. ఇలా ఆడియన్స్‌ అభిరుచులు పూర్తిగా మారిపోయిన తరుణంలో ఓ తమిళ మూవీ తెలుగు రీమేక్‌ సినిమా (Bhairavam Release) ఈ నెల 30న థియేటర్స్‌లోకి రాబోతుంది. అదే భైరవం.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరో (BellamkondaSaiSrinivas). మంచు మనోజ్(ManchuManoj), నారా రోహిత్‌(Nara Rohith)లు ఇతర లీడ్‌ రోల్స్‌ చేశారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌ ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరి చయం అవుతున్నారు. ఆనంది, దివ్యా పిళ్లై ఇతర లీడ్‌ రోల్స్‌లో కనిపిస్తారు. ‘నాంది’ వంటి మంచి మూవీ తీసిన విజయ్‌ కనకమేడల (Bhairavam Movie director Vijay kanakamedala)ఈ సినిమాకు దర్శకుడు. రాధామోహన్, జయంతి లాల్‌ గడ ఈ భైరవం సినిమాను నిర్మించారు. శ్రీచరణ్‌ పాకాల మ్యూజిక్‌ డైరెక్టర్‌.

తమిళ హిట్‌ మూవీ ‘గరుడున్‌’ (bhairavam is Garudan Telugu Remake)కు తెలుగు రీమేక్‌గా ‘భైరవం (Telugu movie Bhairavam Release)’ రానున్నట్లుగా తెలుస్తోంది. ఓ గ్రామంలో ముగ్గురు యువకులు, స్నేహితులు, కులమతాలు..వంటి అంశాల మేళవింపుతో భైరవం సినిమా ముస్తామైంది. తెలుగు నెటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులైతే చేశారని తెలిసింది. నిజానికి భైరవం సినిమాను ఎప్పుడో రిలీజ్‌ చేద్దామనుకున్నారు. ఎందుకంటే. .షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. ఫైనల్‌గా…ఈ నెల 30న రిలీజ్‌ చేస్తున్నారు.

భైరవంతో పాటుగా, రాజేంద్రప్రసాద్‌ ‘షష్ఠిపూర్తి’ సినిమా ఈ నెల 30నే విడుదల అవుతోంది. మరీ..ముఖ్యంగా విజయ్‌దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ మూవీ సైతం ఈ నెల 30నే రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ‘కింగ్‌డమ్‌’ రిలీజ్‌పై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మరో విశేషం ఏంటంటే…ఈ సినిమాలు విడుదలైన నాలుగైదు రోజుల తర్వాత కమల్‌హాసన్‌–మణిరత్నంలు 35 సంవత్సరాల తర్వాత కలిసి, ‘థగ్‌లైఫ్‌ (ThugLife)’ సినిమా చేశారు. ఈ చిత్రం జూన్‌ 5న రిలీజ్‌కు సిద్ధమైంది.

Samantha’s Horror-Comedy Film Shubham Review: శుభం రివ్యూ

Single movie review: శ్రీవిష్ణు సింగిల్‌ మూవీ రివ్యూ

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Manasa Varanasi Shivani Nagaram Heroine Nabanatesh Latest Pics Krithishetty Ritika Nayak