తొలి సినిమా అట్టర్‌ ఫ్లాప్‌..అయినా ముగ్గురు స్టార్‌ హీరోల సినిమాల్లో చాన్స్‌లు

Viswa
2 Min Read
Heroine Bhagyashri Borse

టాలీవుడ్‌లో ప్రజెంట్‌ యంగ్‌ బ్యూటీ భాగ్యశ్రీభోర్సే (BhagyashriBorse) పేరు మారుమోగిపోతుంది. ఎందుకంటే ఈ బ్యూటీకి వరుస అవకాశాలు లభిస్తున్నాయి. రవితేజ హీరోగా హరీష్‌శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ మూవీతో భాగ్యశ్రీభోర్సే తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. హిందీ హిట్‌ ఫిల్మ్‌ ‘రైడ్‌’కు తెలుగు రీమేక్‌గా రూపొందిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో, భాగ్యశ్రీకి ఇక తొందర్లో చాన్స్‌లు రావెమో అనుకున్నారు.

కానీ భాగ్యశ్రీకి మాత్రం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. దుల్కర్‌సల్మాన్‌ హీరోగా చేస్తున్న ‘కాంత’ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరో యిన్‌గా చేస్తున్నారు. రానా ఓ నిర్మాతగా ఉన్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ పూర్తయింది. 1950 నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌ అతి త్వరలోనే రిలీజ్‌ కా నుంది.

ఇక రామ్‌ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లోనూ హీరోయిన్‌గా చేస్తున్నారు భాగ్యశ్రీ. పి. మహేశ్‌బాబు ఈ సినిమాకు దర్శకుడు. ఆల్రెడీ సినిమా చిత్రీకరణ మొదలైంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. మైత్రీమూవీమేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే థియే టర్స్‌లో రిలీజ్‌ కానుంది.

అయితే తాజాగా భాగ్యశ్రీకి మరో బంఫర్‌ ఆఫర్‌ కూడా దక్కినట్లుగా తెలిసింది. సూర్య హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓమూవీ రానుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవరనాగవంశీ ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ కన్ఫార్మ్‌ అయిపోయిందని తెలిసింది.

ఈ చిత్రాలే కాదు…విజయ్‌దేవరకొండ హీరోగా ‘కింగ్‌డమ్‌’ మూవీ తెరకెక్కుతోంది. గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకుడు. అయితే ఈ మూవీలోనూ భాగ్యశ్రీయే హీరోయిన్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఇలా తొలి మూవీఫ్లాప్‌ అయినా..కూడా నాలుగు పెద్ద సినిమాల్లో చాన్స్‌లు దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు.

ఇక భాగ్యశ్రీ నుంచి మరో గాసిప్‌ కూడా వినిపిస్తోంది. హీరో రామ్‌తో భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారని, ఈ హీరోహీరోయిన్లు ప్రజెంట్‌ డేటింగ్‌లో ఉన్నారనే టాక్‌ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇలా వరుస అవకాశాలు, రామ్‌తో ప్రేమ…ఇలా ప్రజెంట్‌ టాలీవుడ్‌లో భాగ్యశ్రీభోర్సే హాట్‌టాపిక్‌ అయిపోయారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *