Brahmaji Baapu Review:
నటీనటులు: బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, ‘బలగం’ సుధాకర్‌రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల, రచ్చ రవి, గంగవ్వ
దర్శకత్వం: దయా
నిర్మాతలు: రాజు, సీహెచ్ భానుప్రసాద్
సంగీతం: ఆర్‌ఆర్ ధ్రువన్
సినిమాటోగ్రఫీ: వాసు పెండెం
ఎడిటింగ్: అనిల్ ఆలయం
విడుదల తేదీ:21-02-2025
నిడివి: 2 గంటలు
కథ
మల్లయ్య (బ్రహ్మాజీ) ఓ సాధారణ రైతు. మల్లన్న భార్య సరోజ. కుమారుడు రాజు. ఆటో డ్రైవర్‌గా చేస్తుం టాడు. మల్లయ్య కుమార్తె వరు (ధన్యబాలకృష్ణ). మల్లయ్య తండ్రి బాపు (బలగం సుధాకర్‌రెడ్డి). వ్యవ సాయంలో బాగా నష్టాలు వస్తాయి. అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి, ఇబ్బంది పెడుతుంటారు. ఈ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు మల్లయ్య. రైతుగా చనిపోతే, ప్రభుత్వం వారు ఇచ్చే రైతుభీమా ఐదులక్షలతో తన కుటుంబం అయినా సంతోషంగా ఉంటుందని మల్లయ్య ఆలోచిస్తాడు. కానీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మల్లయ్యను ఓ వ్యక్తి కాపాడతాడు. కానీ మల్లయ్య ఆలోచనలన్నీ అప్పు తీర్చడం, పిల్లల భవిష్యత్‌పైనే ఉంటాయి. ఈ క్రమంలో తన తండ్రి బాపును చంపితే, రైతు భీమా డబ్బులు ఐదు లక్షలు వస్తాయని…మల్లయ్య–అతని భార్య సరోజ ప్లాన్ చేస్తారు. ఈ ప్లాన్‌కు రాజు, వరులు కూడా ఒప్పుకుంటారు. మరి.. సొంత తండ్రిని చంపేందుకు మల్లయ్య ఎలాంటి ప్లాన్స్ వేశాడు? తన కుటుంబ సభ్యులే తనని చంపాలని ప్లాన్ చేశారని, తెలుసుకున్న బాపు ఏం చేశాడు? చంటి (రచ్చ రవి) వెతుకుతున్న బంగారు విగ్రహానికి బాపుకు ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథనం (Brahmaji Baapu Review)
విశ్లేషణ
డార్క్ కామెడీ కథలు తెలుగులో కాస్త తక్కువగానే వస్తుంటాయి. ఈ జానర్‌లో గ్రామీణనేపథ్యాన్ని తీసుకుని దర్శకుడు దయా ఓ కొత్త ప్రయత్నం అయితే చేశాడు. స్క్రీన్‌పై కనిపించే ప్రతి క్యారెక్టర్‌లోనూ ఒకింత నెగ టివ్ షేడ్స్ ఉంటాయి. ఇది ఈసినిమాకు చాలా ఫ్లస్ పాయింట్. బాపు ఆత్మ హత్య చేసు కుంటాడని, వారి కుటుంబసభ్యులు ఎదురుచూసే సన్నివేశాలతోనే మేజర్‌గా తొలిభాగం సాగుతుంది. బాపు ఆత్మç ßæత్య చేసుకోక పోవడంతో కుటుంబసభ్యులే అతన్ని హత్య చేయాలని అనుకోవడంతో ఇంట్రవెల్ పడుతుంది. బాపు హత్యకు కుటుంబసభ్యులు ఎలాంటి ప్లాన్స్ వేశారు? తండ్రినే చంపాల నుకున్న మల్లయ్య ప్లాన్ ఊరి జనం అందరికీ ఎలా తెలిసింది? అన్న పాయింట్స్‌తో సెకండాఫ్ సాగి, ఫైనల్ గా బంగారు విహ్రగంతో ముగుస్తుంది.(Brahmaji Baapu Review)
కోర్ పాయింట్ చాలా చిన్నది కాబట్టి…ఈ పాయింట్ చూట్టే దర్శకుడు కథను అల్లుకున్నాడు. తొలిభాగంలో వచ్చే కొన్ని రిపీటెడ్ సీన్స్ (బాపు ఆత్మ హత్య చేసుకుంటాడని కుటుంబసభ్యులు ఎదురుచూడడం) ఆడి యన్స్‌ను ఒకింత కష్టపడతాయి. సెకండాఫ్‌లో కూడా ఈ తరహా సన్ని వేశాలే ఉన్నప్పటికీని, బోర్ అని పించదు. కానీ ఓ సాదాసీదా క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్‌కు ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. రాజు లవ్‌స్టోరీ, వరు లవ్‌స్టోరీ ట్రాక్‌లు కథకు, కథలోని కోర్ పాయింట్‌కు ఇబ్బందిగా ఉంటాయి. పైగా వీరి లవ్‌ట్రాక్‌లు కూడా కొత్తగా ఏమీ ఉండవు.
పెర్ఫార్మెన్సెస్
మల్లయ్యగా బ్రహ్మాజీ (Brahmaji)నటనను మెచ్చుకోవాల్సిందే. మార్కెట్ పంట నాశనం అయినప్పుడు బ్రహ్మాజీలోని ఎమోషన్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అదే సమయంలో తండ్రిని చంపేందుకు బ్రహ్మాజీ వేసిన ప్లాన్స్ సమయంలో అతని లోని డార్క్ షేడ్ యాక్టింగ్ కూడా ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ తన అనుభవాన్ని చూపించాడు బ్రహ్మాజీ. సరోజగా ఆమని ఈ సినిమాలో బాగా చేశారు. మీ తండ్రిని చంపేద్దాం అని ఆమని పలికేప్పుడు, ఆమనిలో ఓ మంచి విలనిజం కనిపిస్తుంది. బాపు చంపేందుకు భర్త, కుమార్తెలను కన్విన్స్ చేసే సీన్స్‌లో ఆమనిలో యాక్టింగ్ కనిపిస్తుంది. ఇక బాపుగా ‘బలగం’ సుధాకర్‌రెడ్డి సూపర్భ్‌గా యాక్ట్ చేశాడు. సినిమాలోని మేజర్ హ్యూమర్ ఈ పాత్ర నుంచే వస్తుంది.
ఇకధన్యబాలకృష్ణ ఓ మంచి అమ్మాయిలా బాగా యాక్ట్ చేసింది. రాజుగా మణి ఎగుర్ల, రాజు ప్రేయసిగా అభిత వారి వారి పాత్రల మేరకు యాక్ట్ చేశారు. అన్ని పాత్రలకు సరైన ఎండింగ్ ఇచ్చిన దర్శకుడు రచ్చ రవి పాత్రను ఇన్‌కంప్లీట్‌గా ఉంచేవాడు. అవసరాలశ్రీనివాస్‌ది ఓ గెస్ట్ రోల్ మాదిరి. ఆర్‌ఆర్. ధ్రువన్ మ్యూజిక్, ముఖ్యంగా ఆర్‌ఆర్ ఈ సినిమా కు ప్లస్‌పాయింట్స్. వాసు పెండెం విజువల్స్ ఒకే. అనిల్ ఎడిటింగ్‌కు మరింత కత్తెర చేయవచ్చు. సీరియస్ టెంపోలో మొదలైన రచ్చ రవి క్యారెక్టర్ లాస్ట్‌లో తేలిపోయింది. రాజు, భాను ప్రసాద్‌ల నిర్మాణ విలువలు ఓ మోస్తారుగా ఉన్నాయి.
బాటమ్‌లైన్: కష్టమే…బాపు
రేటింగ్: 2.25/5