పెద్ది క్రేజ్.. ఓవర్సీస్ లో రికార్డ్ బిజినెస్..!

Kumar NA
1 Min Read

Web Stories

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ‘పెద్ది’ సినిమా తాజా బిజినెస్ లెక్కలే నిదర్శనం. ‘గేమ్ ఛేంజర్’ ఫలితంతో పనిలేకుండా, చరణ్ తదుపరి చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో ముందెన్నడూ లేని విధంగా అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడయ్యాయి.

ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ఏకంగా $9.5 మిలియన్లకు (సుమారు రూ. 80 కోట్లు) విక్రయించినట్లు తెలుస్తోంది. మొత్తం డీల్‌లో కేవలం నార్త్ అమెరికా నుంచే $7 మిలియన్లు రావడం విశేషం. రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రాల్లో ఇదొక సంచలన రికార్డ్ అని చెప్పొచ్చు. ఒక గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే కథపై బయ్యర్లు ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది.

గత చిత్రం ఓవర్సీస్‌లో అంతగా రాణించకపోయినా, చరణ్ గ్లోబల్ ఇమేజ్‌పై నమ్మకంతోనే ఈ స్థాయి బిజినెస్ జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ ఏప్రిల్ 30 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గ్లోబల్ స్టార్‌గా మారిన తర్వాత చరణ్ నుంచి వస్తున్న పక్కా మాస్ అండ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో, ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Please Share
Share This Article
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi