Dussehra 2026 release Movies: బిగ్ ఫెస్టివల్ సీజన్స్‌ను ఏ మాత్రం వదులుకోరు స్టార్ హీరోలు. ఈ సంక్రాంతి సీజన్‌లో చిరం జీవి ‘మనశంకరవరప్రసాద్‌గారు’, ప్రభాస్ ‘ది రాజాసాబ్’, రవితేజ ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడము మురారి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సిని మాలు విడుదలైయ్యాయి (2026 Sankranthi Movies). ‘మన శంకర వరప్రసాద్, నారీ నారీ నడము మురారి, అనగనగా ఒక రాజు’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద లాభాలు చూశాయి (Sankranthi 2026 Movies). 2026 సంక్రాంతి ఇలా ముగిసింది. 2027 సంక్రాంతికి సీజన్‌కు రాబోయే సినిమాల లిస్ట్ కూడా రెడీ అవుతోంది.
ఆల్రెడీ ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘ఫౌజి’ సినిమా ఈ దసరా సందర్భంగా థియేటర్స్‌లో రిలీజ్ కానుందని ప్రకటించారు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ లవ్‌స్టోరీ సినిమా ఇది. ఇక రామ్‌చరణ్ పెద్ది సినిమాను మార్చి 27న రిలీజ్ చేయాలను న్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ పెద్ది సినిమా మార్చి 27న రిలీజ్ కావడం లేదని, మే 1న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్స్ సరైన సమయానికి పూర్తికాని పక్షంలో ‘పెద్ది’ సినిమాను ఈ దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ వినికిడి (Dussehra 2026 release Movies).
ఇక నాగార్జున కెరీర్‌లో అత్యంతప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘కింగ్ 100’ (king100 Movie). నాగార్జున కెరీర్‌లోని వందో సినిమా ఇది. తమిళ దర్శకుడు ఆర్‌ఏ కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. నాగార్జునయే నిర్మాత. సుధీర్ఘకాలం గ్యాప్ తర్వాత నాగార్జున–టబులు ఈ సినిమాలో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ కింగ్ 100 సినిమాను దసరాకు రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట నాగార్జున. అప్‌డేట్స్ బయటకు రావడం లేదు కానీ, ఈ సినిమా షూటింగ్ చక చక జరిగిపోతుందట.
ఈ చిత్రాలే కాకుండ మరో రెండు, మూడు మిడ్‌రేంజ్ సినిమాలూ ఈ దసరాకు తమ సిని మాలను విడుదల చేసే పనిలో పడ్డారని తెలిసింది. కానీ దసరా ఫెస్టివల్‌కు చాలా సమయం ఉంది. దీంతో సమీకరణాలు ఏటు మారతాయో తెలియదు. కానీ దసరా ఫెస్టివల్‌కు మాత్రం పెద్ద సినిమాలు వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి.
Heya i am for the primary time here. I came across this board and I to find It really useful & it helped me out a lot. I hope to give one thing again and aid others like you aided me.