వరుస ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్న గోపీచంద్ (Hero Gopichandh 33) ‘విశ్వం’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. శ్రీను వైట్ల డైరెక్షన్‌లోని ఈ మూవీ ఆడియన్స్‌ను ఒకింత అలరించింది. కానీ ‘విశ్వం’ సినిమా తర్వాత గోపీచంద్ నెక్ట్స్ చిత్రం గురించి, ఫైనల్‌గా ఓ క్లారిటీ వచ్చింది. ‘ఘాజీ, అంతరిక్షం’ వంటి ప్రయోగాత్మక చిత్రాలు తీసిన యువ దర్శకుడు సంకల్ప్‌రెడ్డితో గోపీచంద్ మూవీ ఖరారైంది. సిల్వర్‌స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ మూవీని నిర్మించనున్నారు. గోపీచంద్ కెరీర్‌లోని ఈ 33వ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. అతి త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హిస్టారికల్ డ్రామాగా ఈ చిత్రం రానుంది. ఇక గతంలో గోపీచంద్ సక్సెస్‌ఫుల్ ‘సీటీమార్’ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన సంగతి తెలిసిందే.
Raviteja Movie Release: రవితేజ ప్రయత్నం ఫలించేనా?
గోపీచంద్‌తో ‘జిల్’ సినిమా తీశాడు రాధాకృష్ణ. ఈ మూవీ పర్వాలేదనిపించింది. ఇటీవల గోపీచంద్‌కు రాధాకృష్ణ ఓ కథ చెప్పారు. కానీ ఈ సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదు.