చిరంజీవి ఏ ముహూర్తాన ‘విశ్వంభర’ (Chiranjeevi Vishwambhara Release) సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశారో కానీ…ఈ మూవీ వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. ఈ ఏడాది జనవరి 10న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇంకా షూటింగ్ జరుపుకుం టూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ మూవీ నిర్మిస్తోంది.
ముందుగా ‘విశ్వంభర’ (Vishwambhara )సినిమాను మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు.కానీ ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం, షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడం, కొన్ని సీన్స్ రీ–షూట్స్ చేయాల్సి రావడం…వంటి సమస్యల కారణంగా, ‘విశ్వంభర’ సినిమా మూవీ మే9న విడుదల అయ్యే అవకాశం లేదు. దీంతో నెక్ట్స్ రిలీజ్ డేట్ కోసం చిరంజీవి అండ్ టీమ్ ఆలోచిస్తున్నారట. ఈ తరుణంలోనే ఆగస్టు 22…రిలీజ్ డేట్ ఆప్షన్ దొరికిందట. పైగా ఆ రోజు చిరంజీవి బర్త్ డే కూడా కావడం, బాగా కలిసొచ్చే అంశం. ఏలాగూ. . ఆగస్టు 22..శుక్రవారం…వీకెండ్. ఇలా..ఆగస్టు 22 అయితే ..‘విశ్వంభర’ సినిమా రిలీజ్‌కు అన్ని విధాలుగా కలిసొస్తుందని టీమ్ ప్లాన్ చేస్తున్నారట. మరి..ఫైనల్‌గా ఆ రోజే విశ్వంభర చిత్రం రిలీజ్ అవుతుందా? అనేది చూడాలి.
విశ్వంభర షూటింగ్ పూర్తయిన తర్వాత, అనిల్‌రావిపూడి డైరెక్షన్‌లోని మూవీ షూటింగ్‌లో పాల్గొంటారు చిరంజీవి. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లోని మూవీతో చిరంజీవి బిజీ కావొచ్చు. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కదా.