Allu Arjun Movies: ఐదు సంవత్సరాలు…‘పుష్ప’ సినిమా కోసం బన్నీ వెచ్చించిన సమయం. కెరీర్ ప్రైమ్ టైమ్‌లో బన్నీ నుంచి గడిచిన ఐదేళ్లలో వచ్చింది రెండే సినిమాలు. అవి…‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’.
‘పుష్ప’ సినిమా చేయడానికి ముందు బన్నీ చేసిన ‘అల..వైకుంఠపురములో…’సినిమాకు ముందు కూడా బన్నీకి, సినిమా థియేటర్‌కు చాలా గ్యాప్ వచ్చింది. దాదాపు మూడు సంవత్సరాలు. ‘నా పేరు సూర్య..నాఇల్లు ఇండియా’ మూవీ తర్వాత మూడేళ్ల తర్వాత..బన్నీ..‘అల..వైకుంఠపురములో..’ సినిమా చేశాడు.
దీంతో కెరీర్‌లో మళ్లీ అలాంటి తరహా గ్యాప్ రాకూడదని బన్నీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘పుష్ప: ది రూల్’ సినిమా రిలీజ్ కావడానికి ముందు…త్రివిక్రమ్, సందీప్‌రెడ్డి వంగాలతో సినిమాలు చేయడానికి బన్నీ కమిటైయ్యాడు. కానీ ‘పుష్ప ది రూల్’ రిలీజ్ తర్వాత బన్నీ…తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేయాలను కుంటున్నాడు.
త్రివిక్రమ్‌తో బన్నీ ఓ మైథలాజికల్ మూవీ కమిటైయ్యాడు. ఓ సారి సెట్స్‌లోకి దిగితే…ఈ మూవీ చిత్రీ కరణకు, గ్రాఫిక్స్‌కు చాలా సమయం పడు తుంది. కనీసం రెండు సంవత్సరాలు….ఇదే జరిగితే…‘పుష్ప ది రూల్’తో బన్నీకి వచ్చిన క్రేజ్ కొంత తగ్గిపోతుంది. అందుకే…బన్నీ భలే ప్లాన్ వేశాడు.
త్రివిక్రమ్‌తో మూవీ చేయడానికి కంటే ముందే…అట్లీతో ఓ మూవీ చేసేసి, దాన్ని 2026లో రిలీజ్ చేస్తే…ఆడియన్స్‌కు…తనకు పెద్ద గ్యాప్ రాదని అనుకుంటున్నాడు. ఇలా అట్లీ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని అల్లు అర్జున్ డిసైడ్ అయ్యాడు. ‘జవాను’ తర్వాత సల్మాన్‌ఖాన్‌తో మూవీ చేయాలని చాలా సమయం వేస్ట్ చేసుకున్నాడు అట్లీ. ఇకపై ఆలస్యం ఉండకూడదని, బన్నీతో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు. దీంతో..అట్లీ, బన్నీ కాంబోలోని మూవీ 2026 చివర్లో అయినా రిలీజ్ ఉండొచ్చు.