అల్లు అర్జున్ (AlluArjun) కెరీర్‌లో తొలిసారిగా ద్విపాత్రాభినయం (AlluArjun dual role) చేయడానికి రెడీ అవుతున్నారట. ‘పుష్ప ది రూల్’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ ఓ మూవీ చేయనున్నాడు. సన్‌పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించనుంది. జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ కొత్త సినిమా మేకోవర్, లుక్స్ పరంగా ట్రాన్ఫార్మ్ అయ్యే పనుల్లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. విదేశాల్లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటు న్నాడు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ మూవీ అనౌన్స్‌మెంట్ రావొచ్చు.
బర్త్ డేకి అనౌన్స్‌మెంట్
ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమాను ప్రారంభించి, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయాలన్నది అల్లు అర్జున్ అండ్ అట్లీ టీమ్ ప్లాన్ అని తెలుస్తోంది. అయితే కథ రిత్యా ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రా భినయం చేయనున్నారని తెలిసింది. ఇటీవల ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ అన్నప్పుడే…ఈ చిత్రం లో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఈ ఊహాలు నిజమై య్యే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నాయి.
అట్లీ సినిమాలన్నీ డ్యూయెల్ రోల్ సబ్జెక్ట్సే
మరోవైపు దర్శకుడు అట్లీ (Atlee) సినిమాలను ఓ సారి గమనిస్తే…‘తేరీ (తెలుగులో ‘పోలీసోడు’), మెర్సెల్ (తెలుగులో ‘అదిరింది’), బిగిల్’ సినిమాల్లో తమిళ స్టార్ హీరో విజయ్ యాక్ట్ చేశాడు. తేరీ, బిగిల్..సినిమాల్లో విజయ్ ద్విపాత్రాభినయం చేయగా, మెర్సెల్‌లో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. అట్లీ డైరెక్షన్‌లో వచ్చిన లాస్ట్ మూవీ ‘జవాను’. ఈ చిత్రంలో షారుక్‌ఖాన్ ద్విపాత్రాభినయం చేశారు. ఇలా… అట్లీ నుంచి వచ్చిన ప్రతి సినిమాలో హీరోది ద్విపాత్రాభినయం ఉంది. ఇలా…అల్లు అర్జున్‌తో అట్లీ చేసే సబ్జెక్ట్ కూడా డ్యూయోల్ రోల్ అని, ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. మరి..ఏం జరుగుతుందో చూడాలి.