స్పిరిట్‌…కండీషన్స్‌ అప్లై!…ప్రభాస్‌కు బౌండరీస్‌ పెడుతున్న సందీప్‌రెడ్డి వంగా

SandeepReddy Vanga Spirit: స్పిరిట్‌ సినిమా విషయంలో ప్రభాస్‌కు ప్రత్యేకమైన కండీషన్స్‌ పెడుతున్నాడట దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా

Viswa
1 Min Read

దర్శకుడు రాజమౌళి ఫిల్మ్‌మేకింగ్‌లో ఓ యూనిక్‌ స్టైల్‌ ఉంటుంది. తనతో ఏ హీరో అయితే సినిమా చేస్తారో, ఆ హీరో మరో దర్శకుడితో సినిమా చేయకూడదు. ఎప్పుడంటే…అప్పుడు షూటింగ్‌కి రెడీగా ఉండాలి. బల్క్‌ కాల్షీట్స్‌ ఇవ్వాలి….ఇలా రాజమౌళి కండీషన్స్‌ ఉంటాయని చెబుతుంటారు ఫిల్మ్‌నగర్‌ వాసులు. ఇప్పుడు ఈ ఫార్ములానే వాడుతున్నారు సందీప్‌రెడ్డి వంగా.

ప్రభాస్‌ చేతిలో ప్రస్తుతం మల్టీఫుల్‌ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. వీటిలో సందీప్‌రెడ్డి (SandeepReddy Vanga Spirit) వంగా కమిటైన ‘స్పిరిట్‌’ మూవీ ఒకటి. అసలు..ఈ పాటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావాల్సింది. కానీ…ప్రభాస్‌… ప్రెజెంట్‌… ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలు చేస్తున్నాడు. ‘స్పిరిట్‌’ సినిమాను కూడా స్టార్ట్‌ చేసేందుకు ప్రభాస్‌ సిద్ధంగానే ఉన్నాడు. కానీ..ఆ సినిమాలతో పాటుగా, తన స్పిరిట్‌ సినిమాను సమాంతరంగా చేయడం సందీప్‌కి ఇష్టం లేదట.

ప్రభాస్‌ పూర్తిగా తన సినిమాకే టైమ్‌ కేటాయించాలని, అప్పుడే షూటింగ్‌కు వెళ్దామని, ఒకసారి షూటింగ్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత, మరో సినిమాకు ప్రభాస్‌ షిఫ్ట్‌ కాకూడదని సందీప్‌రెడ్డి వంగా భావిస్తున్నారట. ‘స్పిరి ట్‌’ (Spirit) సినిమాలో ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్‌ మరో సినిమా కమిట్‌ అయితే..లుక్స్‌ పరంగా, బాడీ లాంగ్వేజ్‌ పరంగా…తేడాలొస్తాయని, సందీప్‌ అనుకుంటున్నారట. అందుకే…‘స్పిరిట్‌’ షూటింగ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత…మరో సినిమా షూటింగ్‌కు వెళ్లకూడదని ప్రభాస్‌కు కండీషన్‌ పెడుతున్నా డట సందీప్‌రెడ్డి వంగా. అలాగే ‘స్పిరిట్‌’ మూవీలో బాడీ డబుల్స్‌ వాడకూదని, వీలైనంతగా హీరో డైరెక్ట్‌ఇన్వాల్మెంట్‌ ఉండేలా సందీప్‌రెడ్డి ప్లాన్‌ చేస్తున్నాటర. మరి..సందీప్‌ కండీషన్స్‌ను ప్రభాస్‌ ఏ విధంగా ఫాలో అవుతారో చూడాలి.

టీసిరీస్‌ భూషణ్‌ కుమార్, భద్రకాళి పిక్చర్స్‌ ప్రణయ్‌రెడ్డి వంగా (సందీప్‌రెడ్డివంగా సోదరుడు)లు ‘స్పిరిట్‌’ సినిమాను నిర్మిస్తున్నారు. ‘స్పిరిట్‌’ మూవీ 2027 ప్రారంభంలో రిలీజ్‌ కావొచ్చు. ‘స్పిరిట్‌’ మూవీకి హర్ష వర్థన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు.

 

Please Share
4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *