దిల్‌ రాజు అంతటి సాహసం చేస్తారా?

Viswa
1 Min Read
Producer DilRaju 2025

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లోని మూవీ ఇప్పుడు కోలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. షారుక్‌ఖాన్‌తో రూ. 1000 కోట్ల రూపాయాలను కలెక్ట్‌ చేసిన ‘జవాను’ తీశారు అట్లీ. ఇటు… ..‘పుష్ప ది రూల్‌’ మూవీతో రూ. 1800 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టారు అల్లు అర్జున్‌. దీంతో వీరి కాంబి నేషన్‌లోని మూవీపై అంచనాలు ఉండటం సహజం.

అయితే అల్లు అర్జున్‌తో చేయాల్సిన మూవీ కోసం అట్లీ రూ. 100 కోట్ల పారితోషికంగా అడుగుతున్నారనే టాక్‌ కోలీవుడ్‌లో తెరపైకి వచ్చింది. దీంతో ఈ మూవీని ప్రొడ్యూస్‌ చేయడానికి ఇన్ని రోజులు ఆసక్తి చూసిన సన్‌పిక్చర్స్‌ సంస్థ వెనకడుగు వేసిందట. దీంతో ఈ నిర్మాణ విషయమై… నిర్మాత ‘దిల్‌’ రాజు (Producer Dil Raju) తో ఈ అల్లు అర్జున్‌ అండ్‌ టీమ్‌ చర్చలు జరుపుతున్నారనే గాసిప్స్‌ ఇండస్ట్రీలో తెరపైకి వచ్చాయి.

మరోవైపు ఇటీవల తమిళ దర్శకుడు శంకర్‌తో ‘గేమ్‌చేంజర్‌’ తీసి భారీ నష్టాలను చవిచూశారు ‘దిల్‌’ రాజు. అలాగే కోలీవుడ్‌లో వన్నాఫ్‌ ది టాప్‌ హీరో అయిన విజయ్‌తో ‘వారిసు’ సినిమాను తెలుగు, తమిళంలో తీస్తే…‘దిల్‌’ రాజుకు పెద్దగా మిగిలింది ఏమీ లేదు. ఇంకా కమల్‌హాసన్‌తో ‘ఇండియన్‌ 2’ తీయాలను కున్నారు ‘దిల్‌’ రాజు. కానీ శంకర్‌ బడ్జెట్‌ లెక్కలు చూసి, మెల్లిగా తప్పుకున్నారు. ఇండస్ట్రీలో అడ్వాన్స్‌లు
తిరిగిరావు కాబట్టి…శంకర్‌తో తమ బ్యానర్‌లో 50వ చిత్రంగా ‘గేమ్‌చేంజర్‌’ తీశారు ‘దిల్‌’ రాజు. అలాంటిది…అల్లు అర్జున్‌ మాటలకు కన్విస్‌ అయి, అట్లీకి రూ. 100 కోట్ల పారితోషికంతో సినిమా ‘దిల్‌’ రాజు సినిమా తీస్తారా? ‘గేమ్‌చేంజర్‌’ దెబ్బకు మరో తమిళ దర్శకుడితో సినిమా చేసే సాహసం ‘దిల్‌’ రాజు చేస్తారా? అనేది చూడాలి.

సోలో ప్రొడ్యూసర్‌గా కాకుండ, అసోసియేషన్‌తో ‘దిల్‌’రాజు ఈ ప్రాజెక్ట్‌ను టేకప్‌ చేసే ఆలోచనలో ఉన్నారనే గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. మరి…ఏం జరుగుతుందో చూడాలి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *