‘లైగర్, డబుల్‌ఇస్మార్ట్’ వంటి వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడుతున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్ . దీంతో పూరీ జగన్నాథ్ నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుందో అన్న చర్చ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.అక్కినేని నాగార్జున, అక్కినేని అఖిల్…వంటి హీరోలకు పూరీ జగన్నాథ్ కథలు వినిపించారనే టాక్ తెరపైకి వచ్చింది (Vijay sethipathi film with Purijagannadh).
కానీ దర్శకుడు పూరీ జగన్నాథ్ చెన్నై వెళ్లి అక్కడ ఇద్దరు హీరోలకు కథలు వినిపించారట. అందులో ఒకరు విజయ్‌సేతుపతి అని తెలిసింది. ‘కొన్ని సంవత్సరాల క్రితం పిజ్జా, లేటెస్ట్‌గా ‘ఉప్పెన, మహారాజా’ వంటిసినిమాలతో విజయ్‌సేతుపతి తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గర అయ్యారు. ఇప్పుడు ఈ విలక్షణనటుడు విజయ్‌సేతుపతితో పూరీ జగన్నాథ్ కాంబినేషన్ అంటే భలేగా ఉంటుందనే చెప్పాలి. విజయ్‌సేతుపతి వంటి యాక్టర్‌తో, పూరీ జగన్నాథ్ ఎలాంటి సబ్జెక్ట్‌ను డీల్ చేస్తారో చూడాలి. అలాగే…పూరీ జగన్నాథ్– విజయ్‌సేతుపతిల కాంబినేషన్ మూవీ గురించి, అతి త్వరలోనే ఓ అనౌన్స్‌మెంట్ రానుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. æ
ఇక విజయ్‌సేతుపతి యాక్ట్ చేసిన ‘ఏస్, ట్రైన్’ చిత్రాలు ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజ్ కానున్నాయి.