హీరో సల్మాన్‌ఖాన్ (Salmankhan Next film), దర్శకుడు హరీష్‌శంకర్ కాంబినేషన్‌లోని మూవీ ముచ్చట ఇప్పటి కాదు. 2021 ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ (Salmankhan) ను మీట్ అయ్యారట హరీష్‌శంకర్ అండ్ మైత్రీమూవీమేకర్స్. అప్పట్నుంచి వీరి కాంబో సినిమాను గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోసారి సల్మాన్‌ఖాన్, హరీష్‌శంకర్(HarishShankar)ల కాంబో తెరపైకి వచ్చింది.
మరోసారి ఇటీవల సల్మాన్‌ఖాన్‌ను కలిశారట హరీష్‌శంకర్. ఈ సారి హరీష్‌తో సినిమా చేసేందుకు సల్మాన్‌ఖాన్ ఆల్మోస్ట్ ఒకే అన్నారట. మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కానీ కేవిన్ ప్రొడక్షన్స్ సంస్థలో సల్మాన్ ఓ మూవీ చేయాల్సి ఉంది. ఈ మూవీలో బాలకృష్ణ హీరోగా చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఆ తర్వాత సూర్యదేవర నాగవంశీతో హరీష్‌శంకర్ ఓ మూవీ కమిట్‌మెంట్ ఉంది. ఇంకా మైత్రీమూవీమేకర్స్‌తోనే పవన్‌కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీని, హరీష్‌శంకర్ డైరెక్ట్ చేయాల్సి ఉంది.
ఈ కమిట్‌మెంట్స్ పూర్తయిన తర్వాత కానీ సల్మాన్‌ఖాన్‌తో హరీష్‌శంకర్ మూవీ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. సో…సల్మాన్‌ఖాన్, హరీష్ శంకర్‌ల కాంబో మూవీకి ఇంకా సమయం పడుతుందని ఊహింవచ్చు. లేదా సడన్‌గా సల్మాన్‌ఖాన్‌తో మూవీ స్టార్ట్ కావొచ్చు.
ఇటీవల సంజయ్‌దత్ తాను కలిసి ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నామని, ఈ సినిమాకు ఇంకా దర్శకుడు ఖరారు కాలేదని, సల్మాన్‌ఖాన్ అన్నా రు. సో..ఈ మూవీకి హరీష్‌శంకర్ దర్శకుడు అయితే బాగానే ఉంటుంది. కొసమెరుపు…ఏంటంటే…సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్’ సినిమాను తెలుగులో ‘గబ్బర్‌సింగ్’గా పవన్‌కళ్యాణ్‌తో రీమేక్ చేసి, బంపర్‌హిట్ అందుకున్నారు హరీష్‌శంకర్. ఈ విషయం తెలిసిందే.