మూవీ ది టెస్ట్ (Test Movie Telugu Review)
నటీనటులు: నయనతార, మాధవన్, సిద్దార్థ్, కాళీ వెంకట్
నిర్మాణం: చక్రవర్తి రామచంద్ర, శశికాంత్
దర్శకుడు: శశికాంత్
విడుదల తేదీ: 4.4.2025
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
అర్జున్ వెంకట్రామన్ ఇండియన్ క్రికెట్ టెస్ట్ టీమ్ కెప్టెన్. రెండు సంవత్సరాలుగా ఫామ్ కోల్పోయి సతమత మవుతుంటాడు. పైగా అర్జున్‌ని రిటైర్‌మెంట్ ప్రకటింమని పైనుంచి ఒత్తిడి. ఇదే సమయంలో ఇండియా – పాకిస్తాన్ ఫ్రెండ్లీ సిరీస్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. అప్పటికే ఇండియా రెండు టెస్ట్‌లు, పాకిస్తాన్ రెండు టెస్ట్‌లు గెలిచి ఉంటాయి. ఫైనల్‌గా…చెన్నైలో జరిగే ఐదో టెస్ట్‌లో ఎవరు గెలిస్తే వారే విజే తలు.
మరోవైపు అర్జున్ వెంకట్రామన్ స్కూల్‌మెంట్ కుముదా. ఆమె ఫాదర్ అర్జున్‌కు చిన్నప్పటి కోచ్. సైంటిస్ట్‌గా సక్సెస్ కావాలని ప్రయత్నాలు చేస్తున్న శరవణన్, కుముదా భార్యభర్తలు. వీరికి సంతానం లేదు. తల్లి కావాలని కుముదా ఐవీఎఫ్ చేయించుకోవాలనుకుంటుంది. ఇందుకు ఐదు లక్షల రూపాయాలు కావాలి. పైగా శరణవన్ తన సెంటిస్ట్ ప్రయోగం సక్సెస్ కాకపోవడంతో, పెట్టుబడి పెట్టినవారికి తిరిగి యాభై లక్షలు చెల్లిం చాల్సి వస్తుంది. కానీ శరవణన్ దగ్గర డబ్బులు ఏమీ లేవు. కుముదా ఫాదర్ ఇచ్చిన క్యాంటిన్‌ను కూడా తన ప్రాజెక్ట్ కోసం అమ్మేస్తాడు. ఇక తప్పని పరిస్థితుల్లో బెట్టింగ్ ముఠాతో శరణవన్ చేతులు కలుపుతాడు. అర్జున్ వెంకట్రామన్‌ను శరవణన్ ఎలా కంట్రోల్ చేయగలిగాడు? శరవణన్ ప్రయత్నాలకు కుముదా ఎలా సహకరించాల్సి వచ్చింది? అన్నదే మిగిలిన కథ.
ది టెస్ట్ సినిమా ఇప్పటి కాదు. మూడునాలుగు సంత్సరాల క్రితమే అనౌన్స్‌మెంట్ వచ్చింది. స్టార్టింగ్‌లో థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలను కున్నారు. ఫైనల్‌గా ఓటీటీలోకి వదిలారు. నిర్మాత శశికాంత్‌కు ఈ మూవీ దర్శకుడిగా తొలి ప్రయత్నం.
క్రేజీ టెస్ట్ మ్యాచ్ వల్ల నయనతార, అర్జున్, శరవణన్‌ల జీవితాలు ఎలా మారాయి? అన్నదే కథ. బెట్టింగ్ బ్యాక్‌డ్రాప్. చాలా ఓల్డ్ ఫార్ములా. ఫార్మాట్. కథ కూడా చాలా స్లో గా ఉంటంది. కథ మొత్తం మొదటి 20 నిమిషాల్లోనే తెలిసిపోతుంది. ఆ తర్వాత అంతా ప్రేక్షకులు ఊహించగలిగిన సన్ని వేశాలే తెరపైకి వస్తాయి. కథలో ఏ మాత్రం ఆసక్తి ఉండదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అర్జున్, శరవణన్‌ల మధ్య వచ్చే ఫోన్ కాల్
సంభాషణలతోనే మేజర్ సినిమా సాగుతుంది. ఇటు క్రికెట్ మ్యాచ్ కూడా ఆసక్తిగా ఉండదు. ఎమోషన్స్ కూడా కథలో లేవు. కిడ్నాప్ డ్రామా రక్తికట్టిందు. నయనతార, మాధవన్, సిద్దార్థ్…వంటి ప్రముఖ నటీ నటులు ఈ మూవీలో ఉన్నా..ఈ సినిమాకు బలం చేకూరలేదు. కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి.
అర్జున్ వెంకట్రామన్ పాత్రలో సిద్దార్థ్ కనిపించాడు. చాలా సెటిల్డ్ క్యారెక్టర్. నెమ్మదిగా ఈ క్యారెక్టర్ రోల్ వీక్ అయిపోతు ఉంటుంది. క్లైమాక్స్‌లో ఫర్వాలేదనిపించింది. సినిమాలో కుముదాగా నయనతార నటనహైలైట్ అవుతుంది. సెకండాఫ్‌లో మాధవన్–నయనతారల మధ్య వచ్చే సీన్స్ పోటాపోటీగా ఉంటాయి. ఓ దశలో నయనతార క్యారెక్టర్‌లో ఒకింత నెగటివ్ షేడ్స్ కూడా కనిపిస్తాయి. అయితే ఈ క్యారెక్టర్‌ను మంచిగానే ముగించాడు డైరెక్టర్. సైంటిస్ట్ శరవణన్‌గా మాధవన్ నటన మరోసారి హైలైట్‌గా ఉంటుంది. ఫస్టాఫ్‌లో పోరాడే వ్యక్తిగా ఉన్న ఈ క్యారెక్టర్, సెకండాఫ్‌లో విలన్ అవతారంలోకి వెళ్లిపోతాడు. విలన్‌గా మాధవన్ నటన బాగుటుంది. మాధవన్ ఫ్రెండ్‌గా కాళి వెంకట్, సిద్దార్థ్ వైఫ్‌గా మీరా జాస్మిన్, విలన్ గా కుట్టిగా ఆడుకాలమ్ మురుగదాస్….వారి వారి పాత్రల మేరకు చేశారు. నిర్మాణ విలువలు, సాంకేతిక విలువలు ఓకే.
బాటమ్‌లైన్: టెస్ట్ మ్యాచ్ పోయింది.
రేటింగ్ 2/5