హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లోని సినిమాను ఏప్రిల్ 8న అంటే..అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించారు (AlluArjun with Atlee movie Announcement). భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తమిళ నిర్మాణసంస్థ సన్‌పిక్చర్స్ సంస్థ (Sun pictures) నిర్మించనుంది.
ఈ అల్లు అర్జున్ (AlluArjun) కెరీర్‌లోని ఈ 22వ సినిమా, అట్లీ కెరీర్‌లోని ఈ 6వ సినిమా …అనౌన్స్‌మెంట్ కోసం అల్లు అర్జున్ అండ్ అట్లీ టీమ్… ఇటీవల యూఎస్ వెళ్లారు. అక్కడి వీఎఫ్‌ఎక్స్ నిపుణులతో మాట్లాడారు. స్క్రిప్ట్‌విషయాలను చర్చించారు. అల్లు అర్జున్, అట్లీలు అంతర్జాతీయ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలను సందర్శించినవిజువల్స్, ఇటీవల అల్లు అర్జున్ చెన్నై వెళ్లి…అట్లీ, సన్‌పిక్చర్స్ అధినేత కళానిధీమారన్‌తో చర్చలు జరపినవిజువల్స్‌తో…ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.
వేసవి తర్వాత ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చు. ఓ కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్‌ను తీసు కెళ్తున్నట్లుగా అట్లీ పేర్కొన్నాడు. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ దాదాపు రూ. 170 కోట్ల పారితోషికంఅందుకుంటున్నారని, ఈ పారితోషికానికి అదనంగా లాభాల్లో వాటా కూడ ఉందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇక అట్లీ కూడా ఈ సినిమా కోసం దాదాపు రూ. 80 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. లాభాల్లో చిన్నపాటి వాటా కూడా ఉందట. అయితే ఈ విషయాలపై ఏ అధికారిక సమాచారం అయితే లేదు.
#AA22xA6#AA22#Atlee6#HappyBirthdayAlluArjunpic.twitter.com/Jci6ZqmgJh
— TollywoodHub (@tollywoodhub8) April 8, 2025
పుష్ప 2 రిలీజ్ కావడానికి ముందే…దర్శకుడు త్రివిక్రమ్, సందీప్‌రెడ్డి వంగాలతో సినిమాలు కమిటైయ్యాడు అల్లు అర్జున్. కానీ ఈ ఇద్దరు దర్శకుల సినిమాలను పక్కన పెట్టి, ముందు అట్లీ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసు కెళ్తున్నాడట అల్లు అర్జున్.
మరోక ఆశ్చర్యకరమైన విశేషం ఏంటేంటే…సన్‌పిక్చర్స్ సంస్థ ఇప్పటివరకు ఏ తెలుగు హీరోతోనూ స్ట్రయిట్ మూవీ చేయలేదు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేస్తోంది.
అట్లీ ప్రాజెక్ట్ కొంత షూటింగ్ ముగిసిన తర్వాత…త్రివిక్రమ్ సినిమానూ సెట్స్‌పైకి తీసుకెళ్లాలన్నది అల్లు అర్జున్ ప్లాన్ అట. మరి..ఏం జరుగుతుందో చూడాలి.