ప్రభాస్ చేతిలో ‘ది రాజాసాబ్ (Prabhas The Rajasaab Release), ఫౌజి, స్పిరిట్’ ..ఇలా మూడు సినిమాలు ఉన్నాయి. అనౌన్స్‌చేయాల్సినవి మరో మూడు ఉన్నాయి. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ సెట్స్‌కు వెళ్లేదు. మూడేళ్ల క్రితం మొదలైన ‘ది రాజాసాబ్’ సినిమా ప్యాకప్ అవ్వదు. ‘ఫౌజి’ ఇప్పట్లో కంప్లీట్ కాదు. ఇలా…ఏదీ ఏమైనా ఈ ఏడాది ప్రభాస్ సినిమా సెట్స్‌కు వచ్చే దాఖలాలు అయితే లేవు.
‘ది రాజాసాబ్’ సినిమాను ఎప్పుడో స్టార్ట్‌చేశారు..ఈ ఏప్రిల్ 10న రిలీజ్ అన్నారు. కానీ ‘ది రాజాసాబ్’ వాయిదా పడినట్లు ఈ చిత్రం దర్శకుడు మారుతియే స్వయంగా చెప్పారు. ఆశ్చర్యకరంగా..ఇంకా షూటింగ్ కూడ ఉందని సర్‌ప్రైజ్ ఇచ్చారు. సాంగ్స్ కూడా షూట్ చేయాలన్నది మరో కొసమెరుపు. మొత్తానికి ‘రాజాసాబ్’ సినిమా ఈ ఏడాది థియేటర్స్‌లోకి రాకపోవచ్చని పరోక్షంగా చెప్పకనే చెప్పారు మారుతి.
అదీ సంగతి…
ముడుతరాల ఆత్మలు, ప్రేతాత్మల కథ నేపథ్యంతో ‘ది రాజాసాబ్’ సినిమా సాగుతుందట. ఈ పీరియాడికల్ హారర్ కామెడీ ఫిల్మ్‌లో ప్రభాస్ హీరోగా చేస్తుండగా, మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. సప్తగిరి ఓ కామెడీ రోల్ చేశాడు. సంజయ్‌దత్, రిద్ది కుమార్‌లు కీలక రోల్స్ చేశారు. ఈ సిని మాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ‘ది రాజాసాబ్’ సినిమాను నిర్మిస్తున్నారు.
వచ్చే సంక్రాంతికి ‘ది రాజాసాబ్’ సినిమా రిలీజ్ కావొచ్చు. కానీ సంక్రాంతి రిలీజ్ అంటే..ప్రభాస్‌కు ఏ మాత్రం కలిసి రానే రాదు..వర్షం, యోగి …వంటి సినిమాలు సంక్రాంతికి వచ్చినవే. కానీ…ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ప్రభాస్ ప్లాన్ చేసిన ‘ఆదిపురుష్, రాధేశ్యామ్, కల్కి2898ఏడీ’…ఇలా ఏదీ సంక్రాంతికి రిలీజ్ కాలేదు. మరి..‘ది రాజాసాబ్’ సినిమా అయినా సంక్రాంతికి వస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.