విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Vishnu Manchu Kannappa Release) . శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ మూవీ తీస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, మోహన్‌లాల్, బ్రహ్మానందం, ప్రభాస్, కాజల్ అగర్వాల్…ఇలాఎంతోమంది సినీ ప్రముఖులు నటించారు. రూ. 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు (MohanBabu) నిర్మించిన చిత్రం ఇది.
తొలుత కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ పూర్తి కానీ మూలంగా, ఏప్రిల్ 25 నుంచి ‘కన్నప్ప’ (Kannappa) రిలీజ్‌ను వాయిదా వేశారు. లేటెస్ట్‌గా కన్నప్ప సినిమాను జూన్ 27న రిలీజ్(Vishnu Manchu Kannappa Release) చేయబోతున్నట్లుగా విష్ణు మంచు వెల్లడించారు. ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఉత్తరప్రదేశ్ సీయం యోగి ఆదిత్యానాథ్ రిలీజ్ చేశారు.
ఈ కన్నప్ప మూవీలో ప్రీతిముకుందన్ హీరోయిన్‌గా చేస్తుండగా, బుల్లితెర హిందీ మహాభారతం తీసిన దర్శకుడు ముఖేష్‌కుమార్ తెరకెక్కించారు. ఈ మూవీలో శివుని పాత్రలో అక్షయ్‌కుమార్, పార్వతీ పాత్రలో కాజల్ అగర్వాల్, రుద్రగా ప్రభాస్ కనిపిస్తారు.