అజిత్‌ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ రివ్యూ

AjithKumar GoodBadUgly Telugu Review: అజిత్‌కుమార్‌ హీరోగా చేసిన గుడ్‌బ్యాడ్‌ అగ్లీ సినిమా తెలుగు రివ్యూ

Viswa
4 Min Read
AjithKumar GoodBadUgly Movie Telugu review

సినిమా: గుడ్‌బ్యాడ్‌ అగ్లీ (AjithKumar GoodBadUgly Telugu Review)
ప్రధాన తారాగణం: అజిత్, త్రిష, అర్జున్‌ దాస్, సునీల్, ప్రభు
సమర్పణ: టీ సిరీస్‌ గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్‌
నిర్మాణం: నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌
దర్శకత్వం: అధిక్‌ రవిచంద్రన్‌
ఎడిటింగ్‌: విజయ్‌ వేలుకుట్టి
కెమెరా: అభినందన్‌ రామానుజం
సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌
విడుదల తేదీ: ఏప్రిల్‌ 10

ఏకే అలియాస్‌ రెడ్‌ డ్రాగన్‌ (అజిత్‌) వరల్డ్‌ ఫేమస్‌ స్టార్‌ గ్యాంగ్‌స్టర్‌. కానీ రెడ్‌ డ్రాగన్‌ హింసాత్మక ప్రవృత్తి, అతని భార్య రమ్యకు నచ్చదు. దీంతో ఫ్యామిలీలైఫ్‌ను హ్యాపీగా లీడ్‌ చేయాలంటే నేర ప్రవృత్తిని మార్చు కోవాల్సిందేనని రెడ్‌ డ్రాగన్‌కు అల్టీమేటం జారీ చేస్తుంది రమ్య. దీంతో భార్య రమ్మకు మాట ఇచ్చి, తన కొడుకు విహాన్‌కు 18 ఏళ్ల వచ్చేసమయానికి తిరిగి వస్తానని, ఏకే జైలుకు వెళ్తాడు. అలా 17 ఏళ్లు జైలు జీవితం గడుపుతాడు. ఇక జైలు నుంచి తిరిగి వచ్చే సమయంలో అతనిపై ఓ గ్యాంగ్‌ ఏటాక్‌ చేస్తుంది. మరోవైపు రెడ్‌ డ్రాగన్‌ తనయుడు విహాన్‌ను ఓ మర్డర్‌ అండ్‌ డ్రగ్‌ కేసులో సింగపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. కన్నకొడుకును రక్షించుకునేందుకు ఏకే మళ్లీ రెడ్‌ డ్రాగన్‌గా మారతాడా? అసలు..విహాన్‌ను ఆ డ్రగ్‌ కేసులో ఇరికించింది ఎవరు? వీళ్లకూ ఏకేకి ఉన్న శత్రుత్వం ఏమిటి? ఏకేపై దాడి చేసిన గ్యాంగ్‌ ఎవరు? అన్నది మిగిలిన కథ.

ఫక్తు కమర్షియల్‌ తెలుగు సినిమా ఎలా ఉంటుందో అలా…ఈ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమా ఉంటుంది. కుటుంబం కోసం గ్యాంగ్‌స్టర్‌ జీవితాన్ని వదలి, అజ్ఞాతవాసం చేయడం…కుటుంబసభ్యులు ఆపదలో ఉన్నారని తెలుసుకుని మళ్లీ …పాత స్టైల్లోకి వెళ్లడం అనే కమర్షియల్‌ టెంప్లెట్‌ ఇప్పటి కాదు. కానీ ఇది ఎప్పటికీ ఆగదు. ఇందుకు మరో నిదర్శనం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ మూవీ.

స్టోరీ లైన్‌ చిన్నది…మాజీ గ్యాంగ్‌స్టర్‌ తనకొడుకు ఎలా సంరంక్షించుకున్నాడు? అన్నదే స్టోరీలైన్‌ (Good Bad Ugly Movie Review). కానీ ఈ చిత్రం దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ కథను ప్రజెంట్‌ చేసిన తీరు మెచ్చుకోదగినది. స్క్రీన్‌పై అజిత్‌ స్వాగ్, స్టైల్, మేనరిజమ్, డైలాగ్స్‌ డెలివరీ, కటౌట్‌…ఇలా దేన్నీ వదిలిపెట్టలేదు దర్శకుడు. ఎక్కడికక్కడ వీలైనట్లు అజిత్‌ను స్క్రీన్‌పై సూపర్భ్‌గా చూపించాడు. ఈ ఏలివేషన్‌ నీడలో స్టోరీ అన్న పాయింట్‌ కనుమ రుగైపో యింది. ఇక అజిత్‌ ఫ్యాన్స్‌ అయితే…అజిత్‌ ఇలా కనిపిస్తే చాలు..స్టోరీ ఎందుకు? అన్నంతగా సినిమాను ఏంజాయ్‌ చేసేలా ఉంటుంది మూవీ. అజిత్‌ ఫ్యాన్స్‌కు ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ మూవీ పండగలాంటి సినిమా.

టైటిల్‌ కార్డ్స్‌ సమయంలోనే కొంత కథ చెప్పి, ఆడియన్స్‌ను ప్రిపేర్‌ చేశాడు దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌. జైల్లో ఖైదీలు పారిపోకుండ, ఖైదీ ఉన్న హీరో వారిని అడ్డుకునే ఇంట్రోసీన్‌ అదిరిపోతుంది (కార్తీ ‘సర్దార్‌’లోనూ, ఈ తరహా సీనే ఉంటుంది). ఆ తర్వాత కొన్ని రోటీన్‌ సీన్స్, ఇంట్రవెల్‌కు కాస్త ముందే విలన్‌ పాత్రలోని ట్విస్ట్‌ రివీల్‌ అవుతుంది. దీంతో సెకండాఫ్‌లో దర్శకుడు ఏం చేస్తాడా? అనుకుంటే…ఓ ప్లాష్‌బ్యాక్‌ ఏపిసోడ్‌ పెట్టాడు. వింటేజ్‌ అజిత్‌ను స్క్రీన్‌పైకి తెచ్చాడు. సెకండాఫ్‌లో వచ్చే ఫోటోషూట్‌ షూట్‌అవుట్‌ విజిల్‌ మూమెంటే. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ రోటీన్‌గానే ఉంటాయి. ఆడియన్స్‌ ఊహకు తగ్గట్లు.

అజిత్‌ (Ajith) వన్‌ మ్యాన్‌ షో మూవీ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. సినిమానంత తానై నడిపించాడు. స్వాగ్, స్టైల్, హీరో యిజం..ఇలా ప్రతిదాంట్లోనూ సూపర్భ్‌ అని పించాడు. రెడ్‌డ్రాగన్‌..ఏకే..ఇలా రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో అజిత్‌ మెప్పించాడు. బిల్లా, డ్రాగన్, గ్యాంబ్లర్‌ సినిమాల్లోని అజిత్‌ గుర్తుకు వస్తాడు. స్క్రీన్‌ నిండా చాలా క్యారెక్టర్స్‌ ఉన్నాయి…కానీ సినిమా చూసి, బయటకు వస్తున్న ఆడియన్స్‌కు మాత్రం గుర్తుండి పోయేది ఒక్క అజిత్‌ క్యారెక్టర్‌ మాత్రమే. విలన్‌గా అర్జున్‌ దాస్‌ క్యారెక్టర్‌లో వైవిధ్యం ఉంది. మంచి ట్విస్ట్‌ కూడా ఉంది. థియేటర్స్‌లో చూడాల్సిన అంశమిది. యువ నటుడు కార్తీకేయకు విహాన్‌గా మంచి రోల్‌ లభించింది. కథకు కీలకమైన పాత్రలో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మెరిసింది.

సునీల్, ప్రసన్న, ప్రభులు..హీరోకు సపోర్ట్‌గా ఉండే క్యారెక్టర్స్‌ చేశారు. సునీల్‌ క్యారెక్టర్‌ బాగుంటుంది. ఏకే మాజీ ప్రేయసిగా సిమ్రాన్‌ మెప్పిస్తుంది. రమ్యగా త్రిష పాత్రకు స్క్రీన్‌ నిడివి తక్కువే. అలాగే…18 సంవ త్సరాల అబ్బాయికి త్రిష తల్లి పాత్ర చేయడం అనే విషయాన్ని, ఆమె ఫ్యాన్స్‌ ఎలా రిసీవ్‌ చేసు కుంటారో, భవిష్యత్‌లో త్రిషకు ఎలాంటి చాన్సెస్‌ వస్తాయో చూడాలి.

అధిక్‌ (Good Bad ugly Movie Director) రాసుకున్న కథలో బలం లేదు. కొత్తదనం లేదు. కానీ ప్రజెంట్‌ చేసిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. విజువల్స్‌లో కెమెరామేన్‌ పనితనం కనిపిస్తోంది. ఇక ఫైనల్‌గా..జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ఆర్‌ఆర్‌ అదరగొట్టాడు. కొన్ని సీన్స్‌లో కావాల్సిన దాని కన్నా ఎక్కువగా కొట్టాడు. మొత్తానికి బ్యాలెన్స్‌ చేశాడు.

బాటమ్‌లైన్‌: అభిమానులకు గుడ్‌…ఆడియన్స్‌కు బ్యాడ్‌
రేటింగ్‌ 2.5/5

సిద్దుజొన్నలగడ్డ స్పై డ్రామా జాక్‌ రివ్యూ

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *