హీరో అల్లు అర్జున్ (AlluArjun 22 Movie), దర్శకుడు అట్లీ కాంబో మూవీపై విభిన్న రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్ అనీ, ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని, ఈ ఐదుగురిలో ముగ్గురు మెయిన్ హీరోయిన్స్ అని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ మూవీ కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు అట్లీ. ఈ మూవీలో అల్లు అర్జున్ ఇప్పటివరకూ వరకు చేయని విధంగా డబుల్ రోల్ చేస్తారనే ప్రచారం సాగింది. కానీ…డబుల్ కాదు.. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
ఈ మూవీలో ముగ్గురు మెయిన్ హీరోయిన్స్‌ను తీసుకోవడానికి కారణం కూడా ఇదేనట. ఈ ఏడాది అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న ఈ మూవీని ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. 2027లో మూవీ రిలీజ్ కావొచ్చు. ఇంకా హీరోయి న్స్‌గా…జాన్వీకపూర్, దిశాపాటానీ వంటి వార్ల పేర్లు వినిపిస్తున్నాయి.
అట్లీ మూవీలో హీరో ట్రిపుల్ చేయడం అనేది ఇది కొత్తం ఏం కాదు. గతంలో అట్లీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మెర్సెల్’ (తెలుగులో ‘అదిరింది’) మూవీలో హీరో విజయ్ ట్రిపుల్ రోల్ చేశారు.ఇప్పుడు అల్లు అర్జున్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.
అల్లు అర్జున్‌తో అట్లీ చేస్తున్న మూవీ కథను…తమిళ హీరో విజయ్ కోసం రెడీ చేయబడినది అనే ప్రచారం జరుగుతోంది. గతంలో అట్లీ సినిమాలో విజయ్ ట్రిపుల్ రోల్ చేయడం, మళ్లీ ఇప్పుడు అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ అంటూ వార్తలు రావడం…ఇవన్నీ చూస్తుంటే…తమిళ విజయ్ కోసం అట్లీ రెడీ చేసిన కథతోనే…అల్లు అర్జున్‌తో అట్లీ మూవీ చేస్తున్నాడనే టాక్ నిజమేనెమో అనిపిస్తుంది కదూ.