ఇంద్రగంటి జఠాయు బ్యాక్‌స్టోరీ

Jatayu Movie: జఠాయు స్క్రిప్ట్‌ ఎలా మొదలైంది, జఠాయు మూవీ కి ఎందుకు బ్రేక్‌ పడింది? అన్న విషయాలను దర్శకుడు ఇంద్రగంటి వెల్లడించారు.

Viswa
1 Min Read
Director Indraganti Mohanakrishna jatayuu movie

‘అష్టా చమ్మా, వి, సమ్మోహనం’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దాదాపు పదేళ్లుగా ‘జఠాయు’ (Jatayu Movie) అనే స్క్రిప్ట్‌పై వర్క్‌ చేస్తున్నారు. ఈ మూవీని ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారు. ఈ ‘జఠాయు’ మూవీలో విజయ్‌దేవరకొండ, ప్రభాస్ (Prabhas jatayu), నాని…వంటి వార్లు హీరోలుగా నటిస్తారనే ప్రచారం సాగింది. లేటెస్ట్‌గా ‘జఠాయు’ మూవీపై దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ స్పందించారు.

‘‘జఠాయు’ మూవీని గురించిన ఆలోచన నాకు 2016లో కేరళలో నేను ఉన్నప్పుడు కలిగింది. ‘జఠాయు’ మూవీ మైథలాజికల్‌ టచ్‌ ఉన్న యాక్షన్‌ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌. నాలుగుసంవత్సరాలు ఈ సినిమా కథపై పని చేశాను.ఆ తర్వాత 2020లో స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది. మరికొన్ని రోజులు ఈ స్క్రిప్ట్‌పైనే వర్క్‌ చేశాను. 2022లో ఈ కథను ‘దిల్‌’ రాజుగారికి చెప్పగా, ఆయన ఒకే అన్నారు. ఈ సమయంలో ‘దిల్‌’రాజుగారు గేమ్‌చేంజర్‌ మూవీ చేస్తున్నారు. గేమ్‌చేంజర్‌ మూవీకి మరికొంత సయమం పడుతుందని, ఈ లోపు మరొక సినిమాను నన్ను చేసుకోమచని చెప్పారు. అలా శివలెంక ప్రసాద్‌గారితో ఈ సారంగపాణి సినిమాను స్టార్ట్‌ చేశాను

జఠాయు మూవీ వాల్మీకి రామాయణం ఆధారంగానే ఉంటుంది. మనకు చాలా రామాయణాలు ఉన్నాయి. కానీ..వాల్మీకి రామాయణం స్పూర్థితోనే ‘జఠాయు’ మూవీ ఉంటుంది. ఈ మూవీలో హీరోగా కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. అవేవీ నిజాలు కావు. సమయం వచ్చినప్పుడు మేమే చెబుతాం. ఇక కథపై నేను చాలా కాలం వర్క్‌ చేశాను. ఈ కథలోని విషయాలపై నాకు పూర్తి గ్రిప్‌ ఉంది. సో..ఈ కథను నేను మరొ కరికి ఇవ్వాలనుకోవడం లేదు. నా డైరెక్షన్‌లోనే మూవీ ఉంటుంది. అదీ ఎప్పుడు జరిగితే అప్పుడు నా డైరెక్షన్‌లోనే ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. అదీ విషయం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *