‘జైలర్ 2’లో ‘కావాలయ్యా…నువ్వు కావాలయ్యా…’, ‘స్త్రీ 2’ సినిమాలో ‘ఆజ్ కా రాత్’ స్పెషల్ సాంగ్స్ తర్వాత తమన్నా (Tamannaah Bhatia next movies)కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. రజనీకాంత్ ‘జైలర్ 2’ సక్సెస్‌కి, పబ్లిసిటీకి.. కావా లయ్య సాంగ్ బాగా ప్లస్ అయ్యింది. సేమ్…‘స్త్రీ 2’ సినిమా విషయంలోనూ జరిగింది.
ప్రస్తుతం తమన్నాకు వస్తున్న బాలీవుడ్ చాన్సెస్ ఆమె తోటీ హీరోయిన్స్‌ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏకంగా నాలుగు హిందీ సినిమాల్లో తమన్నా భాగమైయ్యాము. వీటిలో మూడు సినిమాలు హీరోయిన్స్‌గా కావడం విశేషం.
అజయ్‌దేవగన్ ‘రేజంర్’ మూవీలో తమన్నా హీరోయిన్‌గా చేస్తున్నారు. అలాగే అజయ్‌దేవగన్ హీరోగా చేసిన మరో సినిమా ‘రైడ్ 2’ (raid2) సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు తమన్నా. ఇక జాన్ అగ్రహాం చేస్తున్న బయోగ్రాఫికల్ డ్రామాలో హీరోయిన్‌గా తమన్నా కన్ఫార్మ్ అయ్యారు. దివంగత ముంబై పోలీస్ కమిషనర్ రాజేష్ మారియా జీవితం ఆధారంగా ఈ మూవీ చేస్తున్నారు. రోహిత్‌శెట్టి ఈ సినిమాకు దర్శకుడు. లేటెస్ట్‌గా సిద్దార్థ్ మల్హోత్రా మూవీ లోనూ తమన్నా హీరోయిన్‌గా సెలక్ట్ కావడం ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయిపోయింది. ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ. దీపక్ మిశ్రా ఈ సినిమాకు దర్శకుడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇలా మిల్కీ బ్యూటీ తమన్నా…బాలీవుడ్‌లో బిజీ బ్యూటీ అవుతోంది.