త్రివిక్రమ్‌తో రామ్‌చరణ్‌?

Viswa
1 Min Read
Trivikram with Ramcharan: త్రివిక్రమ్‌తో రామ్‌చరణ్‌?

త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ చేయాల్సిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ చిత్రీకరణకు చాలా సమయం ఉంది. దీంతో ఈ లోపు మరో సినిమా చేయాలని త్రివిక్రమ్‌ ట్రై చేస్తున్నాడు. వెంకటేష్‌తో త్రివిక్రమ్‌ కాంబో అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘ఆనందరామయ్య కేరాఫ్‌ సీతమ్మ కోట’ అనే టైటిల్‌ కూడా పరిశీలనలో ఉందన్న టాక్‌ తెరపైకి వచ్చింది. కానీ…ఈ మధ్యలోనే పవన్‌కళ్యాణ్‌ వచ్చాడు. త్రివిక్రమ్‌–పవన్‌కళ్యాణ్‌ (Trivikram with Ramcharan) మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. దీంతో రామ్‌చరణ్‌తో ఓ ప్రాజెక్ట్‌ చేయాల్సిందిగా త్రివిక్రమ్‌ను (Trivikram with Ramcharan)కోరారట పవన్‌కళ్యాణ్‌. ఆత్మీయ స్నేహి తుడు కోరికను త్రివిక్రమ్‌ కాదనలేడుగా. సూత్రప్రాయంగా ఒకే చెప్పారాట.

ముందు వెంకటేష్‌తో సినిమా చేస్తారట త్రివిక్రమ్‌. ఈ లోపు బుచ్చిబాబుతో తన పెద్ది (Peddi) సిని మాను పూర్తి చేస్తాడు రామ్‌చరణ్‌. ఆ తర్వాత త్రివిక్రమ్‌–రామ్‌చరణ్‌ల కాంబోలో మూవీ ఉండొచ్చనే టాక్‌ వినిపిస్తోంది. అయితే త్రివిక్రమ్‌.. వెంకటేష్‌తో చేసే సినిమా విడుదల సమయానికి, అట్లీతో అల్లు అర్జున్‌ మూవీని కంప్లీట్‌ చేసినట్లయితే… అప్పడు..త్రివిక్రమ్‌.. తన సినిమాను అల్లు అర్జున్‌తో చేస్తారా? లేక రామ్‌చరణ్‌తో చేస్తారా?అనే ఆసక్తి ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.ఒకవేళ అట్లీతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి అల్లు అర్జున్‌ రెడీ అయిపోతే, సుకుమార్‌ తో రామ్‌చరణ్‌ మూవీ అయిపోవచ్చు. ఆల్రెడీ రామ్‌చరణ్‌-సుకుమార్‌ల కాంబోను గురించిన అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే కదా.

 

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *