‘రెట్రో’(సూర్య హీరోగా చేసిన తమిళ చిత్రం) సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగి నప్పుడు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేయనున్నట్లుగా సూర్య అధికారి కంగా ప్రకటించాడు
ఈ సినిమాలో సూర్య సరసన మమితాబైజు హీరోయిన్‌గా నటిస్తారు. నిజానికి సూర్యతో బాలా చేయాల్సిన ‘వనగామునన్’ (తెలుగులో ‘అచేలుడు’) సినిమాలోనే సూర్య, మమితా యాక్ట్ చేయాల్సింది. కానీ ఆ సినిమా నుంచి సూర్య, ఆ తర్వాత మమితా తప్పుకున్నారు. ఈ సినిమా ను దర్శకుడు బాల తమిళ హీరో అరుణ్‌విజయ్‌తో చేశాడు. రిలీజ్ తర్వాత మూవీ ఫర్వాలే దనిపించింది.
సూర్య, మమితాబైజు హీరో హీరోయిన్లుగా నటిస్తారు. ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తాడు. రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తారు. ఈ నెలాఖర్ నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారు మేకర్స్.
Suriya46 movie photos
సూర్య కెరీర్‌లోని ఈ 46వ సినిమా ప్రారంభోత్సవం సోమవారం (మే 19, 2025) హైద రాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు–నిర్మాత త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ ఇచ్చారు. ఈ సినిమా నిర్మాత నాగవంశీకి, ఆయన బాబాయ్–ప్రముఖ నిర్మాత చిన బాబు(సూర్యదేవరనాగవంశీ) స్క్రిప్ట్‌ను అందించారు.
Suriya46 movie photos
Suriya46 movie photos
వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సర్, లక్కీభాస్కర్ సినిమాలకు బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌కుమార్. దీంతో వెంకీ అట్లూరి డైరెక్షన్‌లోని లేటెస్ట్ మూవీకి కూడా జీవీ ప్రకాష్‌కుమార్‌నే ఎంపిక చేసుకున్నారు మేకర్స్. ఇక సూర్య హిట్ ఫిల్మ్ ‘సూరారైపోట్రు’ (తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సూర్య సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. మధ్యలో సుధాకొంగర-సూర్య కాంబినేషన్‌లోని మూవీకి కూడా జీవీ ప్రకాష్‌కుమార్‌యే సంగీతం ఇవ్వాల్సింది. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి సూర్య తప్పుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌నే శివకార్తీకేయన్‌తో ‘పరాశక్తి’గా తీస్తున్నారు దర్శకురాలు సుధాకొంగర.
సూర్యసన్నాఫ్ క్రిష్ణన్ సినిమా ప్రమోషన్స్‌లో సూర్యను డైరెక్ట్‌గా తొలిసారి చూశారు నిర్మాత నాగవంశీ. సూర్యతో అప్పుడు సినిమా చేయాలని నాగవంశీ మనసులో అనుకున్నారు. అది ఇప్పటికీ కుదిరింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘లక్కీభాస్కర్’ తరహాలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ మూవీ, 2026 వేసవిలో రిలీజ్ కాబోతుంది.