12ఏళ్ల తర్వాత అత్తారింటికి దారేది సెంటిమెంట్‌తో ఓజీ

Viswa

పవన్‌కల్యాణ్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఓజీ’ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 25 విడుదలకు (Pawankalyan OG Release) సిద్ధమైంది. ‘ఓజీ’ సినిమా కొత్త విడుదల తేదీ ఇది. ‘సాహో’ ఫేమ్‌ సుజిత్‌ డైరెక్షన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాత డీవీవీ దానయ్య ఈ గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామా సినిమాను నిర్మిస్తున్నారు.

గమ్మత్తైన విషయం ఏంటంటే…ఈ ‘ఓజీ’ (OG Release) సినిమాను గత ఏడాది సెప్టెంబరులోనే విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు మేకర్స్‌. 2024 సెప్టెంబరు 27న ఓజీ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లుగా అప్పట్లో ఈ చిత్రం నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించారు. కానీ లాస్ట్‌ మినిట్‌లో ‘ఓజీ’ సినిమా రిలీజ్‌ వాయిదా పడటం, ఈ సెప్టెంబరు 27 తేదీకే ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్‌ కొట్టడం జరిగి పోయాయి. ఆసక్తికరంగా మళ్లీ ఏడాది తర్వాత ‘ఓజీ’ సినిమా రిలీజ్‌ మళ్లీ సెప్టెంబరులోనే రిలీజ్‌కు రెడీ అవ్వడం విశేషం.

ముంబైలో ఓజీ!

ప్రస్తుతం ‘ఓజీ’ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి, పవన్‌కల్యాణ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇంకా షెడ్యూల్‌లోనే శ్రియా రెడ్డి, నాజర్‌ వంటివారు పాల్గొంటున్నారని తెలిసింది. ఓజీ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తు న్నాడు. ఓజీ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా పవన్‌కల్యాణ్‌ కనిపిస్తాడు. అన్నీ వదిలేసి వెళ్లిన ఓ గ్యాంగ్‌స్టర్‌ పదేళ్ల తర్వాత తిరిగి గ్యాంగస్టర్‌ మాఫియాలోకి తిరిగి వస్తే ఏం జరుగుతుంది? అన్నదే ఓజీ సినిమా కథాంశమనే టాక్‌ వినిపిస్తోంది.

అత్తారింటికి దారేది..!

ఇక పవన్‌కల్యాణ్‌ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘అత్తారింటికి దారేదీ..!’ సినిమా కూడా సెప్టెంబరు 27, 2013లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఇప్పుడు..సేమ్‌…పన్నెండు సంవత్సరాల తర్వాత ‘అత్తారింటికి దారేది..’ సినిమా విడుదలైన, సెప్టెంబరు నాలుగో వారంలోనే… ఓజీ (OG Release) సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతుంది. ఆసక్తికరమైన విశేషం ఏంటంటే….అత్తారింటికి దారేది..! సినిమాకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్, ఓజీ సినిమా చిత్రీకరణలో కూడా ఇన్‌వాల్‌ అవుతున్నారనే వార్తలు ఉన్నాయి.

రెండుపార్టులుగా ఓజీ!

రీసెంట్‌టైమ్స్‌లో స్టార్‌ హీరోల సినిమాలన్నీ రెండు పార్టులుగానే విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ తాజా చిత్రం ‘ఓజీ’ (pawankalyan OG) కూడా రెండు పార్టులుగానే విడుదల కానుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో విలన్‌గా చేస్తున్న బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హాష్మి ఇటీవల ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. తాను ఇంకా ‘ఓజీ’ సినిమా సెట్స్‌లోనే పాల్గొనలేదని, పవన్‌కల్యాణ్‌కు–తనకు మధ్య అసలు సీన్స్‌ చిత్రీకరణే జరగలేదుని చెప్పుకొచ్చాడు. కానీ ఈ పాటికే ఈ సినిమా చిత్రీకరణ ఎప్పట్నుంచో జరుగుతోంది. దీంతో ‘ఓజీ’ సినిమా రెండు పార్టు లుగా రానుందా? అనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఇంకా…పవన్‌కల్యాణ్‌ తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ సినిమా కూడా రెండు భాగాలుగా విడుదలకు సిద్ధం అవుతుంది. తొలి భాగం ‘హరిహరవీరమల్లు:స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ చిత్రం ఈ జూన్‌ 12న విడుదలకు సిద్దమైంది.

ఉస్తాద్‌భగత్‌సింగ్‌ రెడీ!

గబ్బర్‌సింగ్‌ వంటి బ్లాక్‌బాస్టర్‌ మూవీ తర్వాత హీరో పవన్‌కల్యాణŠ, దర్శకుడు హరీష్‌శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘ఉస్తాద్‌భగత్‌సింగ్‌’. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తారు. మైత్రీమూవీమేకర్స్‌ నిర్మిస్తున్నారు. జూన్‌ నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొం టారు పవన్‌కల్యాణ్‌. ‘గబ్బర్‌సింగ్‌’లో పోలీసాఫీసర్‌గా నటించిన పవన్‌కల్యాణ్‌..మళ్లీ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ కోసం కూడా పోలీసాఫీసర్‌గా నటిస్తుండటం విశేషం. 2027 ప్రారంభంలో ఈ సినిమా రిలీజ్‌ కావొచ్చు.

 

 

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *