Mirai Teaser: తొమ్మిది పుస్తకాలు..వంద ప్రశ్నలు..వన్‌ స్టిక్‌

Viswa
TejaSajja Mirai movie teaser

Web Stories

‘హను–మాన్‌’ సినిమా మ్యాసివ్‌ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో ప్రామిసింగ్‌ యంగ్‌ హీరోగా మారారు తేజా సజ్జా. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లోని ఈ హనుమాన్‌ సినిమా, బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. హిందీ బెల్ట్‌లోనే ఈ మూవీకి రూ. 50 కోట్ల రూపాయాలకు పైగా కలెక్షన్స్‌ వచ్చాయి. ఇప్పుడు ‘మిరాయ్‌’ (Mirai Teaser) సినిమాతో ప్రేక్షకుల ముందకు రానున్నాడు తేజా సజ్జా.


నిఖిల్‌తో ‘సూర్య వర్సెస్‌ సూర్య’, రవితేజతో ‘ఈగల్‌’ సినిమా డైరెక్ట్‌ చేసిన సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని ‘మిరాయ్‌’ (Mirai movie director)  సినిమాకు దర్శకుడు. కార్తీక్‌ ఘట్టమనేనితో (Miraimovie Director)  ‘ఈగల్‌’ సినిమాను నిర్మించిన పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌యే, ఈ ‘మిరాయ్‌’ సినిమాకూ నిర్మాత. లేటెస్ట్‌గా ‘మిరాయ్‌’ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్, డైలాగ్స్‌ అన్నీ బాగున్నాయి. ‘మిరాయ్‌’ సినిమాలో సూపర్‌యోధగా కనిపిస్తాడు తేజా సజ్జా. ఈ మూవీలో మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాకు కాస్త మైథలాజికల్‌ టచ్‌ కూడా ఉంది. మైథలాజికల్‌ టచ్‌తో సాగే, అడ్వెంచరస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘మిరాయ్‌’. రితికా నాయక్‌ హీరోయిన్‌. ‘మిరాయ్‌’ సినిమా సెప్టెంబరు 5న విడుదల కానుంది.

దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ ‘మిరాయ్‌’ చిత్రం, సెప్టెం బరు 5న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ‘మిరాయ్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసినప్పుడు ఈ సినిమాను ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీ రిలీజ్‌ ఆగస్టు 1కి మారింది. తాజాగా సెప్టెంబరు 5కి వాయిదా వేశారు. మరి…సెప్టెంబరు 5న (Tejasajja mirai movie Release date) అయినా విడుదల అవుతుందో లేదో చూడాలి.

 

Please Share
4 Comments
Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos