ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna)లు లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన ‘కుబేర’ (Kubera Story) సినిమా మరో పదిరోజుల్లో థియే టర్స్‌లోకి రానుంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ ‘కుబేర’ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఈ కుబేర చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా కాగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో యాక్ట్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
ఈ కుబేర సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ‘మామ సాంగ్’, టీజర్‌గా వచ్చిన ట్రాన్స్ ఆఫ్ కుబేర సాంగ్ ఆడియన్స్‌ను ఏట్రాక్ట్ చేశాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాను గురించి, మరో ఆసక్తికరమైన వార్తను షేర్ చేశారు ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్. అలాగే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఈ వివరాల ప్రకారం కుబేర చిత్రం నిడివి మూడు గంటలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రీసెంట్ టైమ్స్‌లో మూడు గంటల నిడివి ఉన్న సినిమాలు వచ్చింది తక్కువ. పైగా…కథలో ఎంతో డ్రామా ఉంటే కానీ…ఈ మూడు గంటల నిడివి సినిమాలు వర్కౌట్ కావడం లేదు. సాధారణంగానే..శేఖర్ కమ్ముల సినిమాలు కాస్త స్లోగా ఉంటాయంటారు. స్క్రీన్ ప్లే కూడా కాస్త నెమ్మదిగాను ఉంటందంటారు. ఈ తరుణంలో శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న ఈ కుబేర సినిమా నిడివి మూడుగంటలు ఉండటం చర్చనీయాంశమైంది.
ఎవరి లెక్కలు వారివి..విజయం ఎవరిదో..!
ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే, ఈ సినిమా రెగ్యులర్ మూవీ అయి తే కాదు. సామాజిక కోణంలో ఏదో స్ట్రాంగ్ మేసేజ్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా డబ్బు నేటి ఆధునిక జీవితంలో ఎంతటి ప్రాముఖ్యత పోషిస్తుంది, మనిషిని ఏ విధంగా ఆడిస్తుంది? అన్న అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుందా? అనిపిస్తుంది. అంతేకాక సమాజంలోని ఆర్థిక అసమానతలు, ఆర్థిక నేరాలు..వంటి అంశాలను కూడా శేఖర్ కమ్ముల ఈ సినిమాలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుబేర సినిమా కథ, కథనం, స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి అయితే ఆడియన్స్‌లో క్రియేట్ అయ్యింది. చూద్దాం..మరో పది రోజుల్లో ఈ సినిమా రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కదా.