బన్నీ అనుకున్నది సాధ్యమైనా?

Viswa
AlluArjun and Atlee movie shooting Started

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్‌ మూవీ (aa22 Movie) రానుంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూ టింగ్‌ జూన్‌ 12 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. ఆల్రెడీ ముంబైలో ల్యాండ్‌ అయ్యారు అల్లు అర్జున్‌. తొలి షెడ్యూల్‌లోనే అల్లు అర్జున్, మృ ణాల్‌ ఠాగూర్‌ పాల్గొంటారట. తొలి షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్‌లోకి దీపికా పదుకొనె ఎంట్రీ ఇస్తారట. సన్‌పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. దాదాపు రూ. 700 కోట్ల రూపా యల బడ్జెట్‌తో ఈ మూవీ ఉంటుందని టాక్‌.

ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నాడట అట్లీ. అయితే అల్లు అర్జున్‌ అండ్‌ టీమ్‌ అనుకున్నదాని కంటే ముందే, ఈ సినిమా చిత్రీకరణ ప్రా రంభం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను 2026 చివర్లో, అంటే పుష్ప ది రూల్‌ సినిమా విడుదలైనట్లుగా డిసెంబరులో రిలీజ్‌ చేయాలని అల్లు అర్జున్‌ భావిస్తున్నాడట. భారీ తారాగణం, వారి కాల్షీట్స్, వీఎఫ్‌ఎక్స్‌ పనులు…ఇవన్నీ సెటై్ట ఈ మూవీ 2026 చివర్లో విడుదల అవుతుందా? అసలు..ఇది సాధ్యమైనా? అనేది చూడాలి. ఇంకా ఈ సినిమాలో జాన్వీకపూర్‌ కూడా నటిస్తారనే ప్రచారం సాగుతోంది.

మరోవైపు త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ చేయాల్సిన సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. సందీప్‌రెడ్డి వంగాతో అల్లు అర్జున్‌ చేయనున్న సినిమాపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సినిమా కూడా క్యాన్సిల్‌ అయ్యిందంటున్నారు. ఈ నేపథ్యంలో అట్లీ తర్వాత అల్లు అర్జున్‌ మూవీ ఏ దర్శకుడితో ఉండబోతుందో అన్న అంశం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *