ఆమిర్‌ఖాన్ (Aamirkhan) లెటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par )’. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా హిందీ ట్రైలర్ రిలీజ్ కాగా, తాజాగా ఈ సినిమా తెలుగు, తమిళ ట్రైలర్స్ విడుదుల అయ్యాయి. స్పానిస్ ఫిల్మ్ ‘చాంపియన్’ సినిమాకు హిందీ రీమేక్‌గా ‘సితారే జమీన్ పర్’ సినిమా తెరకెక్కించింది. గతంలో ఆమిర్‌ఖాన్‌తో కలిసి సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమా తీసిన ఆర్‌ఎస్. ప్రసన్న ఈ సినిమాకు దర్శకుడు. హీరోగా నటించిన ఆమిర్‌ఖాన్‌యే ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించాడు. జెనీలియా హీరోయిన్‌గా చేసింది. తాజాగా విడుదలైన ఈ సినిమా తెలుగు ట్రైలర్ (Sitaare Zameen Par Telugu Trailer) ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
తెలుగు ట్రైలర్‌లో కింద ఉన్న డైలాగ్స్ ఉన్నాయి….
నేషనల్ బాక్సెట్‌బాల్ ఫైనల్ ఆఖరి గట్టానికి చేరుకుంది.
మనకు ఇంకా ఇరవై సెకన్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్ మనం గెలవచ్చు
ఈ బాక్సెట్ మనకు చాలా ముఖ్యం..నువ్వు గనక ఈ బాక్సెట్ వేస్తే మనం మ్యాచ్ గెలిచినట్లే.
అసలేం జరుగుతుంది…ఎవరితోనన్నా..సరసాలాడుతున్నావా…!
కోచ్‌గా మంచోడివి..కానీ మనిషిగా పెద్ద వెధవవి.
ఒక అసిస్టెంట్ కోచ్ తన సీనియర్‌పై చేయిచేసుకోవడం జరిగింది.
న్యాయస్థానం ఇతని ప్రతిభను సద్వినియోగపరచాలనుకుంటుంది.
ముద్దాయికి మూడు నెలలు ఇంటలెక్చువల్ డిసెబుల్డ్ విత్ బాక్సెట్‌బాల్ టీమ్‌కి శిక్షణ ఇవ్వాల్సినదిగా నిర్ణయించడమైంది.
మూడునెలల పాటు పిచ్చోళ్లకు నేర్పించాలా….
కొత్త కోచ్ గాడిత.
నేను నీ కోసం పోరాడినట్లే…వాళ్ల కోసం నువ్వు పోరాడాలి