నాగార్జున-ధనుష్‌ల కుబేర మూవీ ఫస్ట్‌ అండ్‌ ప్రీ రివ్యూ

Viswa
Nagarjuna and dhanush Movie Kubera Review

‘కుబేర’ సినిమా ట్రైలర్‌ విడుదలైన తర్వాత, ‘కుబేర’ (Kubera movie) సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ‘కుబేర’ సినిమా ఉండబోతున్న ట్లుగా ‘కుబేర’ సినిమా ట్రైలర్‌ స్పష్టం చేస్తుంది. నాగార్జున, ధనుష్, రష్మికా మందన్నా, జిమ్‌ సర్భ్‌ వంటి స్టార్‌ నటీనటులకు తోడు ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ ఇచ్చిన మ్యూజిక్‌….‘కుబేర’ బలాన్ని ఇంకా పెంచి నట్లుగా ఉంది. మరి…ఇప్పటివరకు ‘కుబేర’ సినిమా నుంచి ఎలాంటి వివరాలు బయటకు వచ్చాయి?ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అనేది ఈ ప్రీ రివ్యూలో (kubera First Review) ఓ లుక్‌ వేద్దాం. ‘కుబేర’  (Kubera movie review)సినిమా జూన్‌ 20న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వచ్చిన ‘సార్‌’ (తమిళంలో ‘వాతి’) సినిమా ధనుష్‌కు తెలు గులో తొలి సినిమా. కానీ ‘సార్‌’ కంటే ముందే శేఖర్‌కమ్ముల …ధనుష్‌కు ‘కుబేర’ కథ చెప్పడం, ధనుష్‌ ఒకే చేయడం జరిగిపోయాయి. కానీ ఈ సినిమా కథను సిద్ధం చేయడం కోసం శేఖర్‌ కమ్ముల చాలా సమయం తీసుకున్నాడు. ఈ లోపు వెంకీ అట్లూరితో ధనుష్‌ ‘సార్‌’ సినిమా చేయడం, ఇది ధనుష్‌కు తెలుగులో స్ట్రయి ట్‌ తెలుగు మూవీ కావడం, విడుదలైన తర్వాత ఈ సినిమా సూపర్‌హిట్‌ సాధించి, వందకోట్ల రూపా యాల క్లబ్‌లో చేరడం జరిగిపోయాయి.

KuberaStory: కథ ఎలా ఉండబోతుంది?

ఇప్పటివరకు విడుదలైన ‘కుబేర’ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్‌ను బట్టి…‘కుబేర’ కథపై ఓ అంచనాకు రావొచ్చు. కథలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉండొచ్చు. కానీ ‘కుబేర’ సినిమా ట్రైలర్‌ చూసిన వారికి, ఈ సినిమా పై ఓ అవగాహన వచ్చేస్తుంది.

కథ ప్రధానంగా డబ్బు గురించి, జరుగుతుంది. ఈ అంశాన్ని పక్కన పెడితే…పేదల వర్గం, ధనిక వర్గం…అనే రెండు ప్రపంచాలను కథలో చూపిస్తున్నట్లు ఉన్నారు దర్శకుడు శేఖర్‌కమ్ముల (Kubera movie Director sekarkammula).

kubera Cast and Crew

పేదల వర్గం వైపు..బిచ్చగాడు దేవగా ధనుష్ (Dhanush) , సమీరగా రష్మిక మందన్నా (RashmikaMandhanna), ఖేలు (అజిత్‌ లాల్‌), కుష్భూ (శ్రావణి), దివ్యన్‌ కనిపిస్తారు.

ధనిక వర్గం వైపు….ప్రధానంగా బాలీవుడ్‌ నటుడు జిమ్‌ సర్భ్, నాగార్జున, రోబో (పాటిల్‌) వంటి వారు కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ‘కుబేర’ సినిమాలో ధనుష్‌ లుక్స్‌లో వేరియేషన్స్‌ కనిపిస్తున్నాయి.

బిచ్చగాడిగా, సాధారణ పేద యువకుడిగా, ధనవంతుడిగా…ఇలా భిన్నమైన లుక్స్‌ కనిపిస్తున్నాయి. ఈ మూడు లుక్స్‌ వెనక ఉన్న కథే ..టోటల్‌ ‘కుబేర’ కథ (Kubera movie story) అని తెలుస్తుంది.

Dhanush kubera movie review
Dhanush kubera movie review

ఈ మూవీలో పెద్ద వ్యాపారవేత్తగా జిమ్‌ సర్భ్ (Kubera movie villain jim sarbh), అతని కింద పనిచేసే అకౌంటెంట్‌ లేదా నమ్మకమైన వ్యక్తి దీపక్‌గా నాగార్జున పాత్ర ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

 


‘‘జాలి పడటం బాగానే ఉంటుంది. కానీ అది మెల్లిగా మిమ్మల్ని చంపేస్తుంది’’ అని నాగార్జునతో జిమ్‌సర్భ్‌ కుబేర మూవీ టీజర్‌లో చెప్తాడు. దీన్ని బట్టి…దేవను ఏదో పని విషయంలో దీపక్‌ (నాగార్జున) నమ్మడం, దేవ ఆ దీపక్‌ నమ్మకాన్ని వమ్ము చేయడం వంటివి జరుగుతాయని ఊహింవచ్చు. ఇంకా పేద, ధనిక వర్గాల మధ్య ఉన్న తేడాలను చెప్పేందుకు శేఖర్‌ కమ్ముల ఏమైనా ఆయిల్‌ మాఫియాను టచ్‌ చేశారా? అనే అనుమానం కలుగుతుంది.

Kubera Movie jim Sarbh
Kubera Movie jim Sarbh

‘కుబేర’ మూవీ పూర్తి విభిన్నమైన సినిమా అని శేఖర్‌ కమ్ముల చెబుతున్నాడు. బిచ్చిగాడి కైనా, కోటిశ్వరుడు కైనా…తల్లి ప్రేమలో తేడా ఉండదు. దేవుడుకైనా, దేశానికైనా కూడా…బిచ్చగాడు లేదా కోటీశ్వరుడు ఒకేలా ఉండాలి…అంటూ ‘కుబేర’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శేఖర్‌ కమ్ముల మాట్లాడాడు. సో..సమాజంలో ధనిక వర్గ ప్రజలను, పేద వర్గ ప్రజలను…దేశం ఒకేలా చూడాలనే ఓ స్ట్రాంగ్‌ పాయింట్‌ను ‘కుబేర’ సినిమాతో, శేఖర్‌కమ్ముల ఇవ్వబోతున్నాడా? అని అనిపిస్తుంది. అలాగే ఓ బిచ్చగాడు..కుబేరుడు అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కూడ కొంత కథ సాగవచ్చని ఊహించవచ్చు. ‘‘ప్రపంచం లోనే అత్యంత ధనవంతుడైనా వ్యక్తికి, ప్రపంచలోనే బికారి అయిన మరో వ్యక్తికి మధ్య ఉన్న తేడాల మధ్య జరిగే కథ’ యే ‘కుబేర’ సినిమా అని, ఈ చిత్రం నిర్మాతలు సునీల్‌ నారంగ్, రామ్మోహన్‌ చెప్పారు.

అదరగొట్టిన దేవిశ్రీ ప్రసాద్‌ (Kubera movie music director)!

‘కుబేర’ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ‘ట్రాన్స్‌ ఆఫ్‌ కుబేర, పోయి రా పోయిరా మామ, పీపీ డుమ్‌డుమ్, నాది నాది’ పాట కానీ..అద్భుతంగా ఉన్నాయి. ‘కుబేర’ సినిమాకు ఓ మంచి బలమైన మ్యూజిక్, ఆర్‌ఆర్‌ ఇచ్చినట్లు ఉన్నారు దేవి శ్రీ ప్రసాద్‌. మరీ..ముఖ్యంగా ఈ సినిమా ఆర్‌ఆర్‌ బాగుంది. ఈ సినిమా మూడును డైలాగ్స్‌ లేకుండానే ముందుకు తీసుకువెళ్తున్నట్లుగా అనిపిస్తోంది.

ప్రస్తుతానికి ‘కుబేర’ సినిమా చుట్టు మంచి పాజిటివ్‌ వైబ్‌ అయితే క్రియేట్‌ అయ్యింది. పైగా ఓ ప్రాపర్‌ మూవీ వచ్చి కూడా…నెలన్నరపైనే అవుతుంది. ఈ తరుణంలో ‘కుబేర’ సినిమా థియేటర్స్‌లోకి వస్తుండటం, ఈ సినిమాకు కచ్చితంగా కలిసొచ్చే అంశమనే చెప్పుకోవాలి. అయితే శేఖర్‌ కమ్ముల సిని మాలు కాస్త స్లో నరేషన్‌తో ఉంటాయి. ఈ సినిమా నిడివి కూడా మూడు గంటలు ఉంది. ఈ ఒక్క విషయంలో..కొత్త శేఖర్‌కమ్ముల స్క్రీన్‌ ప్లేను గనక ఆడియన్స్‌ చూడగలిగితే…ఈ సినిమా సూపర్‌హిట్టే. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా నిర్మాతలు కుబేరులే.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *