దృశ్యం 3…అంతా సిద్ధం!

Kumar NA
ఈ ఏడాది మోహన్‌లాల్‌ (Mohanlal) ఏ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఈ మలయాళ సూపర్‌స్టార్‌ నుంచి వచ్చిన ‘లూసీఫర్‌2: ఎంపురాన్‌’, ‘తుడరుమ్‌’ సినిమాలు విడుదలై, బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. మళ్లీ ఈ ఏడాదే మోహన్‌లాల్‌ నుంచి ‘వృషభ’ అనే చారిత్రక చిత్రం, ‘హృదయపర్వం’ అనే సోషల్‌డ్రామా మూవీ రాను న్నాయి. మోహన్‌లాల్‌ రేంజ్, స్పీడ్, సక్సెస్‌ చూసి ఇతర ఇండస్ట్రీ సీనియర్‌ హీరోలు ఆశ్చర్యపోతున్నారంటే అతిశయోక్తి లేదు.
లేటెస్ట్‌గా మోహన్‌లాల్‌ మరో అద్భుతమైన సినిమాను స్టార్ట్‌ చేయబో తున్నారు. అదే దృశ్యం 3 (Mohanlal Drishyam3). హీరో మోహన్‌లాల్ (Mohanlal), దర్శకుడు జీతూజోసెఫ్‌ కాంబినేషన్‌తో ఇప్పటికే దృశ్యం ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘దృశ్యం ( Drishyam), దృశ్యం 2 ( Drishyam2)’ సినిమాలు బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచిన తరుణంలో, దృశ్యం 3 కి శ్రీకారం చుట్టూరు మోహన్‌లాల్‌. ‘దృశ్యం 3’ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా ప్రకటించిన మోహన్‌లాల్, ‘దృశ్యం 3 ( Drishyam3)’ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది అక్టోబరు నుంచి ప్రారంభం కానున్నట్లుగా తెలిపారు. అక్టోబరు నుంచి షూటింగ్‌ అంటే.. వచ్చే ఏడాది వేసవిలో ‘దృశ్యం 3’ సినిమా రిలీజ్‌ ఉండొ చ్చని ఊహించవచ్చు. ఈ ఏడాది వేసవిలో వచ్చిన ‘ఎంపురాన్, తుడరుమ్‌’ సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన నేపథ్యంలో, వచ్చే ఏడాది వేసవిలో ఓ పర్‌ఫెక్ట్‌ రిలీజ్‌ డేట్‌కి, ‘దృశ్యం 3’ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. దృశ్యం, దృశ్యం2 సినిమాలను నిర్మించిన ఆంటోనీ పెరంబవూర్‌యే ‘దృశ్యం 3’ సినిమాను కూడ నిర్మించబోతున్నారు.

ఇక ఈ మలయాళ దృశ్యం సీరిస్‌ సినిమాలు అంతర్జాతీయ భాషల్లోనూ రీమేక్‌ చేయబడ్డాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ రీమేక్‌ చేశారు. అయితే దృశ్యం, దృశ్యం 2 సినిమా హిందీ రీమేక్‌లూ బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ సినిమాల్లో అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించాడు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే…అజయ్‌దేవగన్‌ కూడా దృశ్యం 3 సినిమాను చిత్రీకరించేందుకు సిద్ధమైయ్యాడు. అక్టోబరులోనే షూటింగ్‌ స్టార్ట్‌ చేసి, వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. మరి…అజయ్‌దేవగన్‌  మోహన్‌లాల్‌లు చేసే దృశ్యం 3 సినిమా కథలు ఒకటేనా, లేక వేరు వేరా? అనేది తెలియాల్సి ఉంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *