Kannappa Review :కథ
చిన్నప్పుడు తన ప్రాణ స్నేహితుడిని కోల్పో యిన సంఘటన కారణంగా తిన్నడు దేవుణ్ణి నమ్మడు. మరో వైపు ఎంతో పవిత్రమైన మరియు శక్తి వంతమైన వాయులింగాన్ని రహస్యంగా కాపాడుతుంటాడు మహాదేవ శాస్త్రి (మోహన్ బాబు). ఈ చనిపోయిన వారికి సైతం ప్రాణాలు పొసే వాయులింగాన్ని సొంతం చేసుకోవాలని కాలముకుడు ప్లాన్ చేస్తాడు. తన ప్రయత్నాల్లో భాగంగా, తన తమ్ముడిని పంపిస్తాడు కాలముకుడు. కానీ కాలముకుడు తమ్ముడుని తిన్నడు చంపేస్తాడు. దింతో తిన్నడుని చంపి, వాయులింగాన్ని దక్కించుకోవాలని కాలముకుడు నిర్ణయించుకుని దాడిని ప్లాన్ చేస్తాడు.
కాలముఖుడిని ఎదుర్కోవడం కోసం, తిన్నడు నాయకత్వం తో.. వాయులింగం ఉన్న ప్రాంతం లోని ఐదు గూడెంల ప్రజలు ఏకం అవుతారు. కానీ గూడెం లో మారెమ్మ తలపెట్టిన ఓ నరబలిని, తిన్నడు అడ్డుకుంటాడు. ఈ కారణంగా గూడెం లోని పెద్దలు, తిన్నడుని బయటకు పంపిస్తారు? మరి.. దేవుణ్ణే నమ్మని నాస్తికుడు తిన్నడు ఆ తర్వాత ఆ శివుడికి ఎలా పరమ భక్తుడు అయ్యాడు? కాలముకుడు నుంచి తన వాళ్ళను తిన్నడు ఎలా కాపాడుకున్నాడు? శివ భక్తురాలు నెమలి తో తిన్నడి ప్రేమ ఏమైంది? వాయులింగాన్ని తిన్నడు ఎలా చేరుకున్నాడు? తిన్నడి జీవితంలో రుద్ర తీసుకొచ్చిన్న మార్పు ఏమిటీ? ద్వాపర యుగం లో కిరాతకు, తిన్నడుకి ఉన్న సంభంధం ఏంటి అనేది సినిమా లో, వెండితెరపై చూడాలి (Kannappa Review)?
Kannappa Review :విశ్లేషణ
కన్నప్ప సినిమాను, 13వ శతాబ్దం లోని బసవ పురాణం, 16వ శతాబ్దంలో దూర్జటి మహాకవి రాసిన శ్రీ కాళహస్తి మహత్యం ఆధారం గా, కన్నప్ప కథ ను రాసాము అని, కథ లో కొన్ని వాణిజ్య అంశాలు, కల్పనికతను సినిమా పరంగా జోడించాము అని మేకర్స్ సినిమా స్టార్టింగ్ లో నే ఓ మోహన్ బాబు వాయిస్ ఓవర్ తో చేప్పించేసారు. మేకర్స్ చెప్పినట్లు గానే కథ లో కొంత కల్పితం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
ఓ సాంగ్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే శివ, పార్వతి ల సంభాషణ లు వినిపిస్తాయి. ఆ తర్వాత తిన్నడు కథ మొదలవుతుంది. తిన్నడి హీరోయిజం షార్ట్స్, లవ్ ట్రాక్, కాలముకుడు ప్రస్తావన, తిన్నడు ని గూడెం నుంచి బయటకు పంపే సీన్స్ తో అల్మోస్ట్ ఇంట్రావెల్ వస్తుంది. భక్తి కి మూఢనమ్మకాల ముసుగు వేయవద్దని విష్ణు చెప్పే సీన్స్, మహాదేవశాస్త్రి ఎంట్రీ, కిరాతకగా మోహన్ లాల్ ఎంట్రీ…. ఫస్టాఫ్ లో ఇవే ప్రేక్షకులకు బాగున్నాయని అనిపించే ఎలిమెంట్స్. చాలా ఊహాత్మక సన్నివేశాలు, సాదా సీదా సన్నివేశాలు, రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి.

సెకండ్ హాఫ్ లో వచ్చే వార్ సీక్వెన్స్ యాక్షన్ ఆడియన్స్ కు నచ్చొచ్చు. మళ్లీ రొటీన్ సన్నివేశాలే ఆడియన్స్ కి కనిపిస్తాయి. ఎప్పుడైతే మహాశివరాత్రి ఎపిసోడ్ ప్రారంభమవుతుందో, ఎప్పుడైతే స్క్రీన్ మీదకు ప్రభాస్ వస్తారో అప్పటి నుంచి మాత్రం కన్నప్ప సినిమా మరో లెవల్ లోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ప్రభాస్ సీన్స్ సూపర్ గా అనిపిస్తాయి. మంచు విష్ణు – ప్రబాస్ ల మధ్య వచ్చే సంభాషణలూ ఆడియన్స్ ఒప్పిస్తాయి. మెప్పిస్తాయి. క్లైమాక్స్ సన్నివేశం హృదయానికి హత్తుకునేలా భావోద్వేగంగా ఉంటుంది.
కాకపోతే సినిమా నిడివి మూడు గంటలకు పైన ఉంది. ఇది కొంచెం మైనస్ గానే అనిపించింది. గ్లామర్ డోస్ కాస్త ఎక్కువయ్యింది. మోహన్ బాబు పాత్ర అసంపూర్ణంగా అనిపించింది. కథలో గూడెం పెద్దల సన్నివేశాలు వచ్చినప్పుడు దేవర, కంగువ సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
Kannappa cast and crew Review :నటీనటుల పెర్ఫార్మెన్స్
తిన్నడు పాత్రకి విష్ణు మంచు (Kannappa VishnuManchu) వంద శాతం న్యాయం చేశాడు. యాక్షన్, ఎమోషన్, ఎలివెషన్ సీన్స్ లో బాగున్నాడు. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ తో, ఆర్. శరత్ కుమార్, మోహన్ బాబు లతో వచ్చే సీన్స్ లో విష్ణు నటన మెప్పిస్తుంది. క్లైమాక్స్ లో మంచి యాక్టింగ్ చూపించాడు. నెమలి గా ప్రీతి ముకుందన్ నటనలో పరవాలేదు. కానీ శివ భక్తు రాలు అంటూ స్స్రీన్ పై చూపించి, ఆ వెంటనే గ్లామర్ షో చేయడం బాలేదు. మహా దేవ శాస్త్రి గా మోహన్ బాబు పాత్ర ఎలివెషన్, డైలాగ్ లకే పరిమితమైంది. యాక్టింగ్ కి స్కోప్ లేదు. హీరో తండ్రి నాధనాధడు గా ఆర్. శరత్ కుమార్ కి మంచి రోల్ దక్కింది. ఈ పాత్రకి మంచి ఓ యాక్షన్ సీన్ కూడా ఉంది. కిరతక గా మోహన్ లాల్ రోల్ సర్ప్రైజ్ గా అనిపిస్తుంది. శివుడి గా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ మెప్పించారు. రుద్రా (Prabhas Rudhra kannappa) గా వెండి తెరపై ఉన్నంత సేపు ప్రభాస్ రెచ్చిపోయాడు. సినిమా స్వరూపణ్ణే మార్చేశాడు. ఈ సినిమా లో ఉన్న మేజర్ హైలైట్ ప్రభాస్ రోల్ నే.
మారమ్మ గా ఐశ్వర్య భాస్కరన్, ఓ గూడెం పెద్ద గా పన్నగా మధు బాల, మరో గూడెం పెద్ద గా కంప గా ముకేశ్ రుషి, కలా మూకుడుగా రవి తమ పాత్ర ల పరిధి మేరకు చేశారు. బ్రహ్మ నందం, సప్తగిరి, రఘు బాబు, బ్రహ్మజీ, శివ బాలాజీ ల రోల్స్ కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. విజువల్స్ సూపర్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఒకే. గ్రాఫిక్స్ పర్వాలేదు. స్టీఫెన్ దేవస్సి మ్యూజిక్, ఆర్ ఆర్ సినిమా కు ప్లస్ అయ్యాయి.
ఫైనల్ గా … అర్జునుడు … తిన్నడు.. కన్నప్ప
రేటింగ్ 2.5/5.0