సిద్దార్థ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘3బీహెచ్‌కే (Siddharth 3BHK)’. ఈ మూవీలో శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు, మీథా రఘునాథ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిం చారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాను శ్రీ గణేష్ (3BHK Movie Director) డైరెక్షన్‌లో, అరుణ్ విశ్వ నిర్మించారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ 3బీహెచ్‌కే సినిమా జూలై 4న రిలీజ్ (3BHK Movie Release date) కి రెడీ అయ్యింది. ఈ నేపథ్యంతో ఈ సినిమా తమిళ ట్రైలర్ ఆల్రెడీ విడుదల కాగా, లేటెస్ట్‌గా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్‌లోని డైలాగ్స్
నాన్న ఫ్యూచర్‌లో మనం ఇల్లు కట్టుకునేప్పుడు పెద్ద ఇల్లు కట్టుకుందాం…
బయట ఒక బోర్డు..వాసుదేవన్ అండ్ ఫ్యామిలీ అని…
అంతా మంచే జరుగుతుంది..అంతా సక్సెస్ అవుతుంది.
నీకు మీ నాన్నంటే చాలా ఇష్టం కదా…
ఏడులక్షల రూపాయాలు కూడబెట్టాను…
ఏంటి సార్..ఏడు ఎనిమిది అంటూ కామెడీలు చేస్తున్నారు…
మన దగ్గర డబ్బు ఉందా లేదా? అని మన బ్యాంకు బ్యాలెన్స్ చూడక్కర్లేదు..మన బాడీ లాంగ్వేజ్‌ని బట్టే డిసైడ్ చేస్తారు.
రిజెక్ట్ చేస్తున్నార్ సార్..లైఫ్ అంటే అంత ఈజీ కాదు గా…
ఆశలు..కలలు..అన్నీ చచ్చిపోయాయి….
ఎన్ని రిజెక్షన్స్, ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినా..ప్రయత్నిస్తూనే ఉంటాను..శ్రమిస్తూనే ఉంటాను. అదీ నాకు బాగా వచ్చు మామ్…
నా వల్ల కాకపోతే ప్రభు ఉన్నాడు..నేనొడిపోయినా..వాడు గెలుస్తాడు..
గెలుస్తాను..నాన్న…
అన్న డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి. 3బీహెచ్‌కే తెలుగు ట్రైలర్‌ని బట్టి, ఈ సినిమా మంచి ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ మూవీగా ఉండబోతుందని తెలుస్తోంది.
మధ్యతరగతి తండ్రి, కొడుకుకి 34 సంవత్సరాలు వచ్చినా, ఉద్యోగం రాని పరిస్థితి, సొంత ఇల్లు కానాలనే ఆశ…ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కనెక్ట్ చేసే ఎలిమెంట్స్‌లా అనిపిస్తున్నాయి. ట్రైలర్ కూడ ఆసక్తికరంగానే ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే, 3బీహెచ్‌కే సినిమా తప్పకుండ, విజయం సాధిస్తుంది. ఇక ఇదే రోజున అక్కా-తమ్ముడు సెంటిమెంట్‌తో నితిన్ హీరోగా చేసిన ‘తమ్ముడు’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ రెండు చిత్రాలూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీస్‌యే కావడం విశేషం.