హరిహరవీరమల్లు ట్రైలర్ రెడీ… పవన్ ఫ్యాన్స్ రెడీనా…

Viswa

హరిహరవీరమల్లు‘ సినిమా కోసం పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూలై 24న ఈసినిమా విడుదల కానుంది. 17వ శతాబ్దం నేపథ్యంతో సాగే ఈ మూవీలో పవన్‌కల్యాణ్‌ టైటిల్‌ రోల్‌ చేశాడు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది. తొలిభాగంగా ‘హరిహరవీరమల్లు స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ సినిమా జూలై 24న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్‌ మెటిరియల్‌ సాంగ్స్‌, పోస్టర్స్‌ అన్నీ ఆసక్తికరంగానే ఉన్నాయి. సినిమా కూడా బాగుంటుదనే టాక్‌ వినిపిస్తోంది. ఈ తరుణంలో ‘హరిహరవీరమల్లు’ సినిమా ట్రైలర్‌ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌తో పాటుగా, ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొని ఉంది. ఈ తరుణంలో ‘హరిహరవీరమల్లు’ సినిమా ట్రైలర్‌ను జూలై 3న రిలీజ్‌ చేస్తున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా వెల్లడించారు. దీంతో ‘హరిహరవీరమల్లు’ సినిమా ట్రైలర్‌ కోసం అందరు ఆసక్తికరంగా ఎదరుచూస్తున్నారు. నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో, నాజర్‌, బాబీ డియోల్‌లు కీలక పాత్రల్లో నటించగా, నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా చేశారు. ఈ మూవీకి జ్యోతిక్రిష్ణ, క్రిష్‌ దర్శకత్వం వహించారు. ఏఏం రత్నం, అద్దంకి దయాకర్‌ రావు ఈ హరిహరవీరమల్లు సినిమాకు నిర్మాతు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి మ్యూజిక్‌ డైరెక్టర్‌.3

ప్రస్తుతం ‘ఉస్తాద్‌భగత్‌సింగ్‌’ సినిమా షూటింగ్‌ పనులతో బిజీగా ఉన్నాడు పవన్‌కల్యాణ్‌. హరీష్‌శకంర్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా యువ దర్శకుడు సుజిత్‌తో పవన్‌కల్యాణ్‌ చేసిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘ఓజీ’ సెప్టెంబరులో రిలీజ్‌ కానుంది. ఉస్తాద్‌భగత్‌ సింగ్‌ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ కావొచ్చు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *