సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘వార్ 2’ (Suryadevara Nagavamsi War2) సినిమా తెలుగు థియేట్రికల్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇందుకోసం నాగవంశీ రూ. 80 కోట్ల రూపాయలను కోట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. హ్రితిక్ రోషన్ (HrithikRoshan), ఎన్టీఆర్ (NTR)లు మెయిన్ లీడ్ హీరోలుగా, కియారా అద్వానీ మరో లీడ్ రోల్‌లో చేసిన స్పై యాక్షన్ మూవీ ‘వార్ 2’ (War2 Movie) ఆగస్టు 14న విడుదల కానుంది. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న ఒకే ఒక సాంగ్ చిత్రీకరణ ప్రస్తుతం ఎన్టీఆర్- హ్రితిక్ రోషన్‌ల మద్య ముంబైలోని వైఆర్‌ఎఫ్ స్టూడియలో జరుగుతోంది. ఇందుకోసం ఓ భారీ సెటప్ రెడీ చేశారు. ఈ సాంగ్ పూర్తయితే ‘వార్ 2’ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లే. నిజానికి ఈ పాటను మేలోనే చిత్రీకరించాలని ఏర్పాట్లు చేశారు. కానీ ఈ సాంగ్‌కు రిహార్సల్స్ చేసే సమయంలో హ్రితిక్‌రోషన్‌కు గాయం కావడం వల్ల అప్పట్లో ఈ ఈ పవర్‌ఫుల్ మాస్ డ్యాన్స్ బీట్ సాంగ్‌ను షూట్ చేసేందుకు వీలుపడలేదు. దీంతో ఇప్పుడు ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు. స్క్రీన్‌పై ఈ సాంగ్ ఓ రేంజ్‌లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
వైఆర్‌ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) (YRF) స్పై యానివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ‘వార్ 2’ సినిమాలో ఆల్రెడీ ఈ స్పై యూనివర్స్‌లో భాగమైన స్టార్ హీరోలు షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్,జాన్ అబ్రహాం,ఆలియాభట్ వంటి వార్లు కనిపించే చాన్సెస్ ఉన్నాయి. ఆగస్టు 14న (War2 Release date)విడుదల కానున్న ‘వార్ 2’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో తెలుగు హక్కులను నాగవంశీ దక్కించుకున్నారు. గతంలోనే ‘వార్ 2’ హక్కుల కోసం నాగవంశీ ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపించింది. కానీ మేలో ఈ విషయంపై నాగవంశీ స్పందించి, అప్పట్లో ‘వార్ 2’ కోసం తానేమీ చేయడం లేదని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ‘వార్ 2’ తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ హీరోగా నటించిన గత చిత్రం ‘దేవర’ సినిమా థియేట్రికల్ హక్కులను కూడా నాగవంశీ సొంతం చేసుకుని, దేవర సినిమా విజయం సాధించడంతో, ‘దేవర’ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌కు నాగవంశీ దుబాయ్‌లో గ్రాండ్ పార్టీని ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక నాన్-తెలుగు థియేట్రికల్ రైట్స్ ఇలా రూ. 80 కోట్ల రూపాయాలను సాధించిన సినిమాగా ‘వార్ 2’ చిత్రం సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసిందని ఫిల్మ్‌నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
మరోవైపు ‘వార్ 2’ సినిమాకు పోటీగా అదే రోజు …రజినీకాంత్ హీరోగా, నాగార్జున విలన్‌గా నటించిన ‘కూలీ’ (Coolie)సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రిలీజ్ హక్కులను ఏసిషియన్ సునీల్ సంస్థ దాదాపు రూ. 50 కోట్ల రూపాయలకు దక్కించుకుందనే వార్తలు ఉన్నాయి. రజనీకాంత్ గత చిత్రం ‘జైలర్’ తెలుగులో సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ‘కూలీ’ చిత్రంపై కూడా అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడం, శ్రుతీహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర వంటి ప్రముఖ ఆర్టిస్టులు నటించడం ‘కూలీ’ సినిమాకు కలిసోచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే…ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రానున్న భారీ మైథాలజికల్ ప్రాజెక్ట్‌కు నాగవంశీ ఓ నిర్మాతగా ఉండనున్నారని తెలుస్తోంది. ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్‌లో కార్తికేయుడుగా ఎన్టీఆర్ కనిపిస్తారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి ఇంకా బోలెడు సమయం ఉంది.