ఎన్టీఆర్ బాలీవుడ్‌లో చేసిన డైరెక్ట్ ఫిల్మ్ ‘వార్ 2 (War2)’. ఈ చిత్రంలో హ్రుతిక్‌రోషన్ మెయిన్ లీడ్ రోల్ చేయగా, మరో లీడ్ రోల్‌లో ఎన్టీఆర్ చేశారు. ఇంకా కియారా అద్వానీ మరో ప్రధాన పాత్రధారి. అయాన్ ముఖర్జీ డైరెక్టర్. ఫైనల్‌గా ఈ సినిమా చిత్రీకకరణ పూర్తయింది. ఎన్టీఆర్, హ్రుతిక్‌ల మధ్య ఓ సూపర్‌డూపర్ సాంగ్ సీక్వెన్స్ షూటింగ్‌తో ‘వార్ 2’ సినిమా షూటింగ్ పూర్తయింది. నిజానికి ఈ సాంగ్‌ను ఎప్పుడో షూట్ చేయాల్సింది. కానీ…ఈ పాట రిహార్సల్‌లో భాగంగా హ్రుతిక్ రోషన్ గాయపడటంతో, వేసవిలో చిత్రీకరించాల్సిన ఈ పాటను, జూలైలో మొదటివారంలో చిత్రీకరించారు.
వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ వార్ 2 సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మించాడు. 2019లో వచ్చిన ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ చిత్రం తెరకెక్కింది. అయితే ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని తెలిసింది. ఇటీవల విడుదలైన ‘వార్ 2’ సినిమా టీజర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక ‘వార్ 2’ సినిమా తెలుగు థియేట్రికల్ రిలీజ్ హక్కులను నాగవంశీ దక్కించుకున్నాడు. ‘అరవిందసమేత వీరరాఘవ, దేవర’ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ నటించిన మరో చిత్రం ‘వార్ 2’ సినిమాను నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.
Coolie Release date: కూలీతో బాలీవుడ్ వార్
అయితే ఆగస్టు 14ననే..రజనీకాంత్ ‘కూలీ’ సినిమా కూడా విడుదల అవుతోంది. ఈ చిత్రంలో నాగార్జున విలన్ రోల్ చేశాడు. దీంతో ‘వార్2′, కూలీ’ సిని మాల మధ్య టఫ్ బాక్సాఫీస్ ఫైట్ జరగనుంది. ‘వార్ 2’ తెలుగు థియేట్రికల్ హక్కులను నాగవంశీ దాదాపు రూ. 90 కోట్లకు దక్కించుకోగా, ‘కూలీ’ తెలుగు హక్కులను ఏషియన్ సునీల్ సంస్థ రూ. 50 కోట్లకు దక్కించుకుంది. రెండు భారీ బడ్జెట్ చిత్రాలే. ఒక దశలో కూలీ వర్సెస్ వార్ 2…బాక్సాఫీస్ పోటీ ఉండదనే అనుకున్నారు. కానీ…ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో, ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అవుతున్నాయి.
కానీ నార్త్‌లో వైఆర్‌ఎఫ్ సంస్థకు బలమైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. దీంతో..నార్త్‌లోనూ, సౌత్ మల్టీఫ్లెక్స్ చైన్స్‌లోనూ ‘వార్ 2’ సినిమాకు కాస్త ఎక్కువగా థియేటర్స్‌కు దొరికే చాన్సెస్ కనిపిస్తున్నాయి. మరీ..ముఖ్యంగా ఐమ్యాక్స్ టెక్నాలజీ ఉన్న థియేటర్స్‌ను ‘వార్ 2′ సినిమా టీమ్ బ్లాక్ చేస్తుందట. ఇది..’కూలీ’ సినిమా యూనిట్‌కు ప్రతికూల అంశం. కానీ ‘కూలీ’ సినిమాలో నాగార్జున, శ్రుతీహాసన్, ఉపేంద్ర, సౌబిన్‌షాహిర్, సత్యరాజ్…ఇలా తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ భాష ఆర్టిస్టులు ఉన్నారు. తెలిసిన నటులు ఈ సినిమాలో ఉన్నారు. సో…ఈ రకంగా దక్షి ణాదిలో కూలీ పాపులారిటీ బాగానే ఉంది. పైగా నార్త్ సినిమాలు తెలుగులో విడుదలై, ఇటీవల హిట్ కొట్టినవి చాలా తక్కువ. ఈ తరుణంలో…’కూలీ’ సినిమాకు దక్షిణాదిలో మంచి కలెక్షన్స్ వచ్చే చాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు.