ఫిల్మ్‌ ఇండస్ట్రీపై గ్రిప్‌ పోయింది!

Viswa

పవన్‌కల్యాణ్‌ ‘హరిహరవీరమల్లు’ (Pawankalyan HHVM Prerelease) సినిమాకి రేపు సాయంత్రం ప్రీమియర్స్‌ ప్రదర్శించనున్నారు. గురువారం ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ తరుణంలో హైదరాబాద్‌లో జరిగిన ‘హరిహరవీరమల్లు’ సినిమా ప్రీ రిలీజ్‌ (Pawankalyan HHVM Prerelease) ఈవెంట్‌లో పవన్‌కల్యాణ్‌ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశారు. తనను అందరు రీమేక్స్‌ చేస్తున్నందుకు తిడుతూ ఉంటారని, ఆ విషయం తనకు తెలుసని, జనసేన పార్టీని నడిపేందుకు, తన భార్య పిల్లల పోషణకు త్వరతిగతిన పూర్తయ్యే రీమేక్‌ సినిమాలే తనకు దిక్కు అయ్యాయని పవన్‌ (Pawankalyan) తెలిపారు. తానెప్పుడు సక్సెస్‌ లలో పెరగలేదని, ఫ్లాప్‌ సినిమాల్లోనే పెరిగానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఒకే ఒక ఫ్లాప్‌ మూవీ రావడంతో తనకు ఫిల్మ్‌ ఇండస్ట్రీపై గ్రిప్‌ పోయిందని, తాను చేసిన పాపం అదొక్కటేనని ఆయన వాపోయారు.

తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తన వెంట ఎవరు రాలేదని పవన్‌కల్యాణ్‌ గతాన్ని గుర్తుచేసుకున్నారు. కష్టకాలంలో మన వెంట ఉండేవాడే నిజమైన మిత్రుడని, ఈ విషయంలో త్రివిక్రమ్‌తో తనకు చాలా సహాయం చేసి, ఆత్మీయ మిత్రుడుగా మారిపోయాడని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. అసలు త్రివిక్రమ్‌ శ్రీనివాసరావు ఉంటే ఎవరో కూడా తనకు తెలియదని, కష్టాల్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్‌ ఎక్కడ్నుంచో వచ్చి, జల్సాలాంటి హిట్‌ మూవీ ఇచ్చారని, త్రివిక్రమ్‌ను పొగిడారు పవన్‌కల్యాణ్‌.

ఇంకా హరిహరవీరమల్లు సినిమా (Hariharaveeramallu) విషయంలో తాను నిరుత్సాహపడ్డ ప్రతిసారి, కీరవాణి (Music Director MMKeeravani) మ్యూజిక్‌తో విడుదల అయ్యే, ఈ సినిమా ప్రమోషనల్‌ కంటెంట్‌ తనకు ఉత్సాహం ఇచ్చేదని, ఈ సినిమాకు నిజమైన హీరో కీరవాణియే అని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. హరిహరవీరమల్లు సినిమా కోసం క్లైమాక్స్‌లో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ డిజైన్‌ చేశామని, ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌కు తానే కొరియోగ్రఫీ చేశానని, మార్షల్‌ ఆర్ట్స్‌లో తనకు ఉన్న అనుభవం, ఫైట్స్‌పై ఉన్న అవగాహన ఇందుకు దోహదపడ్డాయని కూడా పవన్‌ పేర్కొన్నారు. హీరోయిన్‌ నిధీ అగర్వాల్‌ హరిహరవీరమల్లు సినిమా ప్రమోషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారని, ఆమె స్పూర్తితో ఈ సినిమాకు హీరోనైనా నేను కూడా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనాలని నిర్ణయించుకుని, వరుస మీడియా సమావేశాలకు హాజరవుతున్నట్లుగా కూడా పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

ఇంకా మన చరిత్రలో మొఘలు రాజులైన అక్బర్‌, షాజహాన్‌, ఔరంగజేబుల గొప్పదనమే ఉందని, వారి ఆరాచకాలు లేవని, మన విజయనగరం సామ్రాజ్యం ఘనత, మన రాజుల శౌర్యాలను గురించి, తన పాఠ్యాంశాలు, పుస్తకాల్లో లేవని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఔరంగజేబు పరిపాలన కాలంలో హిందూవుగా బతకాలంటే టాక్స్‌ కట్టాల్సి వచ్చేదని, దీనికి చేసిన తిరుగుబాటే ఈ సినిమా క్లైమాక్స్‌ అని పవన్‌కల్యాణ్‌ తెలిపారు.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *