SSMB30: పది సంవత్సరాల క్రితమే మహేశ్‌బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సింది. కానీ అప్పట్లో కుదర్లేదు. ఫైనల్‌గా ఇప్పుడు సినిమా (SSMB29) చేస్తు న్నారు. రాజమౌళితో(Rajamouli) మహేశ్‌బాబు సినిమా అంటే ఎన్నో అనుమానాలు. రాజమౌళి కండీషన్స్‌కు మహేశ్‌బాబు ఒప్పుకోరని, మహేశ్‌బాబు (Maheshbabu) తరచూ ఫ్యామిలీటైమ్‌లో భాగంగా వేకేషన్స్‌కు వెళ్తుంటారని, ఇది రాజమౌళికి నచ్చకపోవచ్చని అంటూ ఏవెవో పుకార్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో షికార్లు కొట్టాయి. కానీ వీరి కాంబినేషన్‌లోని సినిమా షూటింగ్ సజావుగా అంతా హ్యాపీగా సాగుతుంది. కానీ మహేశ్‌బాబు ఎప్పటిలానే తన వేకేషన్స్‌కు టైమ్ కేటాయించుకుంటున్నాడు. ప్రజెంట్ కూడా వేకేషన్‌లోనే ఉన్నారు శ్రీలంకలో.
ఈ విషయం ఇలా పక్కన పెడితే….రాజమౌళితో సినిమా చేసేప్పుడు, తన హీరో మరో సినిమా చేయడానికి, మరో సినిమా అనౌన్స్‌మెంట్ చేయడానికి అంతగా ఒప్పుకోడు. కానీ ఇప్పుడు మహేశ్‌బాబు విషయంలో రాజమౌళి రాజీ పడక తప్పేలా లేదు. ఎందుకంటే…ఆగస్టు 9న మహేశ్‌బాబు బర్త్ డే. అదీ కూడా…50వ బర్త్ డే. సో..ఆ రోజు మహేశ్‌బాబుకు ఎంతో స్పెషల్. ఆ రోజు మహేశ్‌బాబు ఫ్యాన్స్ రాజమౌళి సినిమా అప్‌డేట్స్‌ను కోరుకుంటున్నారు. ఇది ఇంతటితో ఆగలేదు. అదే రోజు మహేశ్‌బాబు కొత్త సినిమా (SSMB30) ప్రకటన కూడా వస్తుందనే టాక్ తెరపైకి వచ్చింది. మహేశ్‌బాబు కొత్త సినిమాకు సందీప్‌రెడ్డి వంగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకవేళ మహేశ్‌బాబు 50 వ బర్త్ డేకి మహేశ్‌బాబు కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ నిజంగానే వస్తే…అది నిజంగా విశేషమే. ఎందుకంటే..రాజమౌళితో సినిమా చేస్తున్న ఏ హీరో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ కూడా, ఆ సినిమా ప్రయాణంలో రాలేదు. వేకేషన్స్‌కు టైమ్ తీసుకోవడం అయినా, కమర్షియల్ యాడ్స్ షూటింగ్స్‌లో పాల్గొనడం అయినా….కొత్త సినిమా అయినా..మహేశ్‌బాబుకే ఎలా సాధ్యమౌతున్నాయో? మరి.
మహేశ్‌బాబు- రాజమౌళి కాంబినేషన్‌లోని సినిమా షూటింగ్ తాత్కాలిక బ్రేక్ వచ్చింది. కొత్త షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌లో వేసిన సెట్‌లోనా లేక ఫారిన్ షెడ్యూల్‌లా? అనేది అతి త్వరలోనే తెలుస్తుంది. ప్రియాంకా చోప్రా, ప్రుధ్వీరాజ్ సుకుమారన్‌లు ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 2027లో ఈ సినిమా రిలీజ్ కావొచ్చు.