Sundeep kishan: 2019 మార్చి 29న నితిన్(nithin) బర్త్ డే సందర్భంగా ఓ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. అదే క్రిష్ణచైతన్యతో (Krishnachaitanya), నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడని. నితిన్ కూడా ఈ సినిమాను కన్ఫార్మ్ చేసి, 2020 సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని అప్పట్లో ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. రెండు పార్టులుగా ఈ సినిమాను తీయాలను కున్నారు అప్పట్లో. సత్యదేవ్ ఓ కీలక పాత్రధారి. ఏమైందో ఏమో కానీ..ఈ సినిమా సడన్‌గా ఆగిపోయింది. ఆ తర్వాత విశ్వక్‌సేన్‌తో క్రిష్ణచైతన్య సినిమా కన్ఫార్మ్ అయిపోయింది. ఈ సినిమా పవర్‌పేట అనుకున్నారు. కానీ కొత్తకథతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తీశాడు క్రిష్ణచైతన్య. ఈ సినిమాకు డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఆరేళ్ల క్రితం తాను సిద్ధం చేసిన ‘పవర్‌పేట’ సినిమాను యాక్టివేట్ చేశాడు క్రిష్ణచైతన్య.
ఈ పవర్‌పేట (Powerpeta) కథపై చాలా హోమ్‌వర్క్ చేసి, సందీప్‌కిషన్‌కు వినిపించగా, ఒకే చెప్పాడట. ఆగస్టులో ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని, ఆ తర్వాత అతి త్వరలనే ఈ సినిమా సెట్స్‌కు వెళ్తుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరి…ఈ సినిమాలో ఉన్న మరో పవర్‌ఫుల్ పాత్రను అప్పట్లో అనుకున్నట్లుగానే సత్యదేవ్‌నే చేస్తాడా? లేక మరో యంగ్ హీరో ఎవర్నన్నా మేకర్స్ అప్రోచ్ అవుతారా? అనేది చూడాలి.
ఇటు సందీప్‌కిషన్ సినిమాలు కూడా వరుసగా క్యాన్సిల్ అయ్యాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా తీసిన, దర్శకుడు స్వరూప్‌తో సందీప్‌కిషన్ హీరో ‘వైబ్’ అనే సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత తమిళంలో సందీప్‌కిషన్ కమిటైన ‘మాయావన్’ సినిమా కూడా క్యాన్సిలైంది. ప్రజెంట్ తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జోసెఫ్ జాన్సన్ దర్శకత్వంలోని సినిమాలో హీరోగా చేస్తున్నాడు సందీప్‌కిషన్. అలాగే ది ఫ్యామిలీమేన్ సీజన్3లో సందీప్ యాక్ట్ చేశాడు.