అన్నంత పని చేశాడు..యూట్యూబ్‌లో సితారే జమీన్‌ పర్‌ సినిమా

Viswa
BollywoodActor Aamirkhan news

ఓటీటీల వల్ల సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం కలుగుతుందని బాలీవుడ్‌ నటుడు- దర్శక-నిర్మాత ఆమిర్‌ఖాన్‌ ఎప్పట్నుంచో వాపోతున్నాడు. ఒకనొక దశలో ..అవసరమైతే తన సినిమాలను యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ అయినా చేస్తాను కానీ ఓటీటీ సంస్థలకు అమ్మనని చెప్పాడు. ఆమిర్‌ఖాన్‌ ఇప్పుడు అన్నంత పని చేశాడు. తన లేటెస్ట్‌ హిందీ సినిమా ‘సితారే జమీన్‌ పర్‌’ సిని మాను యూబ్యూట్‌ చానెల్‌లో స్ట్రీమింగ్‌ పెట్టనున్నాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ ఆమిర్‌ఖాన్‌ టాకీస్‌లో (AamirKhanTalkies) రూ. వంద రూపాయలు చెల్లించి, భారతీయ ప్రేక్షకులు ఈ సినిమా చూ డొచ్చని, పే పర్‌ వ్యూ విధానంలో ఆగస్టు 1 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని, ఓపెన్‌ చేసినప్పట్నుంచి 48 గంటల సమయం ప్రేక్షకులకు ఉంటుందని కూడా ఆమిర్‌ఖాన్‌ స్పష్టం చేశాడు.అలాగే తాను చేపట్టిన ఈ ప్రయత్నానికి జనతా కా థియేటర్‌ (Janata ka Theater) అనే పేరు పెట్టుకున్నారు ఆమిర్‌ఖాన్‌.

Aamirkhan Sitaare ZameenPar movie poster
Aamirkhan Sitaare ZameenPar movie poster

ఈ విషయంపై ఆమిర్‌ఖాన్‌ చాలా సమయం ముంబైలోని మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు.

‘సితారే జమీన్‌ పర్‌’ సినిమా కోసం పెద్ద ఓటీటీ కంపెనీ వాళ్ళు రూ. 125 కోట్ల రూపాయలను నాకు ఆఫర్‌ చేశారు. కానీ నేను వద్దనుకుని, నా సినిమాను యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌కి పెట్టాడు. దీని వల్ల నాకు ఎంత లాభం వస్తుందో నాకు తెలియదు. కానీ ఓటీటీ సంస్థల సబ్‌స్క్రిప్షన్‌ విధానం అనేది సినిమా పరిశ్రమకు చేటు చేస్తుంది. అందుబాటు ధరల్లో సినిమా అందరికీ అందుబాటులో ఉండాలని కలలు కన్నాను. ఇప్పుడు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. భారతదేశం జనాభాలో కేవలం 2 నుంచి 3 శాతం మందే, థియేటర్స్‌కు వెళ్తున్నారు. కానీ ఒక రోజులో సరాసరిన రూ. 55 కోట్ల మంది భారతీయులు యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్‌ని వినియోగిస్తున్నారు. పైగా యూపీఐ చెల్లింపుల వల్ల, డిజిటల్‌ పేమంట్స్‌లో ఇండియా చాలా అడ్వాన్డ్స్‌గా ఉంది. ఈ తరుణంలో నా సినిమాలను ప్రమోట్‌ చేసుకునేందుకు యూట్యూబ్‌ నాకు సరైన వేదిక అనిపించింది.

అందుకు నన్ను క్షమించండి!

‘సితారే జమీన్‌ పర్‌’ సినిమా ప్రమోషన్స్‌ సమయంలో ఈ సినిమాను యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌కు ఉంచుతారా? అని కొందరు నన్ను అడిగారు. కానీ వారికి నేను అబద్ధం చేశాను. నా సినిమా థియేట్రికల్‌ బిజినెస్‌ దెబ్బతినకూడదనే అలా చెప్పాను. ఇందుకు వారికి నా చేతులు జోడించి, క్షమాపణలు చెబుతున్నాను. ఇక మా ఆమిర్‌ఖాన్‌ టాకీస్‌ చానెల్‌లో, పే పర్‌ వ్యూ విధానంతో పాటుగా, ఉచితంగా చూసే సినిమాలు కూడా ఉంటాయి. భవిష్యత్‌లో ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ (Aamirkhan Productions) లో నిర్మించబడే సినిమాలు, ఆల్రెడీ నిర్మించబడిన మరికొన్ని సినిమాలు…మా ఆమిర్‌ఖాన్‌ టాకీస్‌ చానెల్‌లోనే ఉంటాయి. యంగ్‌ ఫిల్మ్‌మేకర్స్‌ ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే, వారి కోసం మా ప్లాట్‌ఫామ్‌ను కేటాయిస్తాం. ఇది ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుంది.

ఇక ఆమిర్‌ఖాన్‌ ఓ గెస్ట్‌ రోల్‌లో నటించిన తమిళ చిత్రం ‘కూలీ’ ఆగస్టు 1 నుంచి థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. రజనీకాంత్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు లోకేష్‌ కగనరాజ్‌ దర్శకత్వం వహించారు. ఇక ఆమిర్‌ఖాన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సూపర్‌హీరో సినిమా రానుంది. 2026లో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఇంకా…. భారతీయ సినిమా పితామహుడుగా చెప్పుకునే దాదా సాహేబ్‌ ఫాల్కే బయోపిక్‌, కిషోర్ కుమార్‌ బయోపిక్‌ చిత్రాల్లోనూ ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటిస్తారు. ఈ చిత్రాలతోపాటుగా,  మరికొన్ని సినిమాలు ఉన్నాయి. తన ప్రొడక్షన్‌ హౌస్‌లోనూ ఆమిర్‌ఖాన్‌ కొన్ని సినిమాలను నిర్మిస్తున్నారు.

మీ శక్తులేవీ మా దగ్గర పనిచేయవు..

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *