kingdom First Review: విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ ( kingdom First Review). ఈ సినిమా ‘జెర్సీ’ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్, వెంకటేష్ (తమిళ యువ నటుడు) కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా బడ్జెట్ రూ. 130 కోట్ల రూపాయలు అని నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ( kingdom First Review).
కానిస్టేబుల్ సూరి పాత్రలో విజయ్‌దేవరకొండ కనిపిస్తాడు. సూరి అన్నయ్య శివ పాత్రలో సత్యదేవ్, శ్రీలంకలో ఉండే గ్యాంగ్‌లోని కీలక వ్యక్తి మురుగన్‌గా వెంకటేశ్, మధు పాత్రలో భాగ్య శ్రీ బోర్సే కనిపిస్తారు. శ్రీకాకుళం వెళ్లిన తన అన్నయ్య శివ (సత్యదేవ్) కనిపించకుండ పోవడంతో సూరి టెన్షన్ పడుతుంటాడు. ఇదే సమయంలో సూరి ఓ అండర్‌కవర్ ఆపరేషన్‌ను చేయాల్సి వస్తుంది. ఇందుకోసం సూరి శ్రీలంక వెళ్లాల్సి ఉంటుందట. ఓ గ్యాంగ్ ఇన్ఫర్మేషన్‌ను పోలీసులకు అందించడమే ఈ అండర్‌కవర్ ఆపరేషన్. ఈ క్రమంలో ఆ గ్యాంగ్‌స్టర్ గ్యాంగ్‌లో క్రీయాశీలకంగా ఉన్నది తన అన్నయ్య శివనే అని, అతను జైలులో ఉన్నాడని సూరికి తెలుస్తుంది. అక్కడ శివ, సూరిల మధ్య వైరం మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తన తమ్ముడు సూరి..ఒక పోలీస్ ఇన్ఫార్మర్ అన్న విషయం తెలిసిన శివ పరిస్థితి ఏమిటి? శివపై మధుకు ఎందుకు కోపం? అన్న విషయాల చుట్టూ ‘కింగ్‌డమ్’ సినిమా కథ సాగుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ విషయం ఈ సినిమా ట్రైలర్ చూసిన వారికి కూడ ఇట్టే అర్ధమైపోతుంది (Vijaydevarakonda kingdom First Review)
ఒక పక్క వార్ జరుగుతున్నప్పుడే..మరో వైపు విజయ్, భాగ్యశ్రీల లవ్‌ట్రాక్ నడుస్తుంటుంది. ముఖ్యంగా విజయ్, సత్యదేవ్‌ల మధ్య వచ్చే సీన్స్, విజయ్-భాగ్య శ్రీల మనస్ఫర్థలు , ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయని తెలిసింది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కాస్త స్లోగా ఉంటుందట. జైలు సీక్వెన్స్‌లలో విజయ్ యాక్టింగ్ సూపర్భ్‌గా ఉంటుందట.

ఇక టెక్నికల్‌గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ఎంత బలంగా ఉందో, అంతే విధంగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, నవీన్ నూలి ఎడిటింగ్, మరీ ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఉండబోతున్నాయి. ‘కింగ్‌డమ్’ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఎమోషనల్ కాన్‌ప్లిక్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఆడియన్స్ మనసుల్లో ఎమోషనల్ మూలాలు ఇక్కడ్నుంచే స్టార్ట్ అయ్యేలా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేశాడట. ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు. దాదాపు 140 రోజుల పాటు షూటింగ్ చేశారు. 80 శాతం లైవ్ లోకేషన్స్‌లో షూటింగ్ చేయగా, 40 శాతం శ్రీలంకలో, 40 శాతం వైజాగ్‌లో, మిగిలినది హైదరాబాద్, కేరళలో షూటింగ్ చేశారు.
వరుస ప్లాఫ్స్‌లో ఉన్న విజయ్‌కి ఈ సినిమా విజయం చాలా కీలకం. ప్రీ సేల్స్ పరంగా ఇప్పటికే రూ. 10 కోట్లు రూపాయలు వచ్చాయి. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ రూ. 100 కోట్ల రూపాయాలని టాక్. నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 50 కోట్లు వచ్చాయట. ఈ సినిమాను హిందీలో ‘సామ్రాజ్య’ పేరుతో విడుదల అవుతుంది. ఇంకొన్ని గంటల్లో కింగ్‌డమ్ సినిమా ఇండియాలోని థియేటర్స్‌లోకి రాబోతుంది. మరి..ఆడియన్స్ వర్డిక్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం.
అన్నంత పని చేశాడు..యూట్యూబ్‌లో సితారే జమీన్ పర్ సినిమా