Varuntej: ‘మట్కా’ సినిమాపై హీరో వరుణ్‌తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కరుణకుమార్ దర్శకత్వం చేసిన ‘మట్కా’ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. వరుణ్ గతంలో చేసిన ‘గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలైంటెన్’ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో యాక్షన్ సినిమాలకుస్మాల్ బ్రేక్ ఇవ్వాలనుకున్నాడు వరుణ్‌తేజ్. తనకు కొత్త జానర్ అయిన హారర్‌ను ఎంచుకున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రన్ రాజా రన్’ వంటి సినిమాలను తీసిన మేర్లపాకగాంధీ దర్శకత్వంలో వరుణ్‌తేజ్ నెక్ట్స్ మూవీ తెరకెక్కనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రెమ్ ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే మార్చిలో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. మరి…మరి వరుణ్‌తేజ్ ఈ కొత్త దారిలోనైనా సక్సెస్ అవుతాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.