కథ:
War2 movie Review: ఇండియన్ రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఛీప్ సునీల్ లూథ్రా (అశుతోష్ రానా)ను, రా మాజీ ఏజెంట్ కబీర్ (హ్రితిక్ రోషన్) చంపేస్తాడు. దీంతో రా కొత్త ఛీప్‌గా విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్) ఛార్జ్ తీసుకుంటాడు. కబీర్‌ను పట్టుకునేందుకు విక్రమ్ చలపతి (ఎన్టీఆర్)తో కలిసి ఏ టీమ్‌ను ఏర్పాటు చేస్తాడు. మరోవైపు భారతదేశం చుట్టు పక్కల ఉన్న దేశాల్లోని కీలక ప్రతినిధులు…కలి కార్టైల్‌గా ఏర్పాటై, భారతదేశాన్ని దెబ్బ తీయాలని ఎప్పటికప్పుడు వ్యూహా రచనలు చేస్తుంటాయి. ఈ క్రమంలో కబీర్‌ను తమలో భాగస్వామిగా చేసుకోవాలని కలి కార్టైల్ ప్లాన్ చేస్తుంది. మరి… సునీల్ లూథ్రాను చంపిన కబీర్‌ను రా సంస్థ పట్టుకోగలిగిందా? కలి కార్టైల్ లక్ష్యాలు నెరవేరాయాయా? భారత ప్రధాని రక్షణ బాధ్యత ఎవరు తీసుకున్నారు? సునీల్ లూథ్రా కుమార్తె కావ్యా లూథ్రా (కియారా అద్వానీ)కి కబీర్‌కి ఉన్న సంబంధం ఏమిటి? కబీర్ జీవితంలో రఘు ఎవరు? అనేది మిగిలిన కథ (War2 movie Review).
విశ్లేషణ
ఇద్దరు టాప్ హీరోలతో సినిమా చేయడం అనేది ఏ దర్శకుడికైనా, కత్తి మీద సాములాంటింది. రాజమౌళి అంతటి దర్శకుడు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లను పెట్టి, ‘ఆర్‌ఆర్‌ఆర్’ తీస్తే…మేజారిటీ ఆడియన్స్ ఎన్టీఆర్ పాత్రకు న్యాయం జరగలేదుని పెదవి విరిచాను. కానీ ‘వార్ ‘ సినిమాలో ఈ చిత్రం దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ విషయంలో కాస్త ఫర్వాలేదనిపించాడు. హ్రితిక్-ఎన్టీఆర్ రోల్స్‌ను బాగానే బ్యాలెన్స్ చేశాడు. హీరో యిజం తాలుకు ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లపైనే మేజర్ ఫోకస్ పెట్టి కథను వదిలేశాడు. రోటీన్ స్పై డ్రామా ‘వార్ 2’ సినిమాను ముగిం చేశాడు.
వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన సినిమా కాబట్టి ‘వార్ 2‘పై ఆడియన్స్‌లో కచ్చితంగా అంచనాలు ఉంటాయి. ఈ యూనివర్స్ నుంచి పఠాన్, ఏక్తా టైగర్, టైగర్ జిందా హై…వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలొచ్చాయి. అయితే వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ బ్రాండ్‌ని దర్శకుడు అయాన్ ముఖర్జీ క్యాపిటలైజ్ చేయలేకపోయాడు. కథలో బలం లేదు. తొలిభాగం అంతా ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను హైలైట్ చేయడం, మలిభాగం అంతా హ్రితిక్ క్యారెక్టర్‌ను హీరోగా చూపెట్టడంతోనే సరిపోతుంది. ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్‌ల ఎంట్రీ యాక్షన్ సీక్వెన్స్‌లు, వీరిద్దరి కాంబినేషన్‌లో సలామ్ అనాలి సాంగ్, ఇంట్రవెల్‌లో వీరిద్దరి కాంబినేషన్‌తో ఓ భారీ ఫైట్. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లతోనే సినిమా సరిపోతుంది. కథలో డ్రామాకు ఇంకెక్కడ స్కోప్ లేదు. సెకండాఫ్‌లో కబూ- రఘుల ఎపిసోడ్ కూడా రోటీన్‌నే. ఈ ఎపిసోడ్ స్పై డ్రామా కథను పక్కకు తీసుకెళ్లినట్లుగా కని పిస్తుంది. అప్పటివరకు రఘు ఫస్ట్ అన్న ఎన్టీఆర్ క్యారెక్టర్, తన ప్రాణం కాపాడిన కబూకు దాసోహమై, ఇండియా ఫస్ట్ అని, కలి కార్టైల్ అంతు చూడటం ఇవన్నీ నిమిషాల వ్యవధిలో జరిగిపోతాయి. దావోస్ ఏపిసోడ్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇంట్రవెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు బాగానే ఉన్నా…స్పై డ్రామాలను ఇష్టపడే ఆడియన్స్‌కు ఇవి సరిపోవు.
ఎవరు ఎలా చేశారు?
రా మాజీ ఏజెంట్ కబీర్ పాత్రలో హ్రితిక్‌రోషన్ బాగానే యాక్ట్ చేశాడు. ‘వార్ 2’ సినిమా మేజర్‌గా యాక్షన్‌పైనే ఫోకస్ పెట్టారు. దీంతో హ్రితిక్ రోషన్‌కూ యాక్టింగ్ చేసేందుకు పెద్ద స్కోప్ లేదు. ఉన్న కొద్దిపాటి యాక్షన్ సీన్స్‌లో బాగానే చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో హ్రితిక్ పాత్రకు మంచి చాన్స్ లభించింది. ఇక విక్రమ్ చలపతి పాత్రలో ఎన్టీఆర్ కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్, హ్రితిక్ క్యారెక్టర్‌కు వార్నింగ్స్ ఇస్తుం డటంతోనే, ఎన్టీఆర్ పాత్రకు సరిపోయింది. హ్రితిక్‌తో కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ యాక్టింగ్ స్క్రీన్‌పై బాగుంది. ఈ పాత్రతో వచ్చే ట్విస్ట్‌లు ఒకే.
ఇక కావ్యగా కియారా అద్వానీకి కథలో పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఫస్టాఫ్‌లో కావ్యా పెద్దగా కనిపించదు. సెకండాఫ్‌లో స్క్రీన్‌పై కనిపించడమే తప్ప, ఈ పాత్రకు యాక్టింగ్‌లో స్కోప్ లేదు. స్క్రీన్‌పై కనిపించేది కొంచెం సేపే అయినా…అశుతోష్ రాణా, అనిల్‌కపూర్‌లకు మంచి పాత్రలు పడ్డాయి. సెకండాఫ్‌లో అనిల్ కపూర్‌కు ఒకట్రెండు మంచి సీన్స్ పడ్డాయి. డిఫెన్స్ మినిస్టర్ సారంగ్‌గా వరుణ్ బడోలా, కలి కార్టైల్ ఇండియా ప్రతినిధి గులాటిగా కేసీ శంకర్, హ్రితిక్ కుమార్తె అరిస్టా మెహతాగా రూహి సాహ్ని….వంటి వారు వారి వారి పాత్రల మేరకు చేశారు. వైఆర్‌ఎఫ్ నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. స్క్రీన్‌పై విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. సంగీతం ఒకే. ఆర్‌ఆర్ బాగుంది. కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ చేయవచ్చు ఇంకాస్త. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో.
ఫైనల్‌గా…. ఓన్లీ స్పై & యాక్షన్…నో డ్రామా
రేటింగ్ 2/5