రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మైసూర్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్ పై ఓ భారీ సాంగ్ (Peddi song Release)ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. మరోవైపు ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ‘‘మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్‌గారు ‘పెద్ది’ సోల్ అండ్ ఎమోషన్‌ను అద్భుతంగా క్యాప్చర్ చేశారు. మా చిత్రం నుంచి త్వరలోనే తొలిపాట రానుంది. పెద్ది..ఏఆర్ రెహమాన్ మ్యూజి కల్’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు రామ్‌చరణ్. అలాగే ఏఆర్ రెహమాన్‌తో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు రామ్‌చరణ్. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
త్వరలో పెద్ది పాట

Leave a Comment