మంచు విష్ణు హీరోగా నటించిన మైథలాజికల్ అండ్ హిస్టారికల్ సినిమా ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కన్నప్ప పాత్రలో మంచు విష్ణు యాక్ట్ చేశారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో, ప్రభాస్, మోహన్‌లాల్ మోహన్ బాబు, ఆర్. శరత్‌కుమార్, మధుబాల, రఘుబాబు, బ్రహ్మానందం, సప్తగిరి, బ్రహ్మా జీ, ముకేష్ రుషి, శివబాలాజీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేకాదు..ఈ చిత్రంలో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ మంచు, కుమార్తెలు అరియానా, వివియానాలు కూడా నటించడం విశేషం.
ఈ ఏడాది జూన్ 27న ఈ చిత్రం విడుదలై, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అమెజాన్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో కన్నప్ప చిత్రం ఈ సెప్టెంబరు 4 నుంచి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కన్నప్ప సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైన, దాదాపు 60 రోజుల తర్వాత, ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.